Share News

AP Election 2024: వారిపై చర్యలు తీసుకోండి.. సీఈవో మీనాను కలిసిన టీడీపీ నేతలు

ABN , Publish Date - May 23 , 2024 | 08:01 PM

దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నడిపేందుకు చర్యలు చేపట్టాలంటూ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ... సీఈవో ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వైసీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశామని తెలిపారు.

AP Election 2024: వారిపై చర్యలు తీసుకోండి.. సీఈవో మీనాను కలిసిన టీడీపీ నేతలు

అమరావతి: దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ (YSRCP) నేతలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నడిపేందుకు చర్యలు చేపట్టాలంటూ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు (Mukesh Kumar Meena) టీడీపీ (TDP) నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) మాట్లాడుతూ... సీఈవో ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వైసీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశామని తెలిపారు. మాచర్లలో 202 పోలింగ్ బూత్‌లోకి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యంగా ప్రవేశించారని, ఈవీఎంను పగులగొట్టడం అందరూ చూశారని పేర్కొన్నారు.


వర్ల రామయ్య సూటి ప్రశ్నలు ఇవే..

13 తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈవీఎంను పగలకొడితే.. ఆ పోలింగ్ బూత్ పీవో ఎందుకు రిపోర్ట్ చేయలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘‘ అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నారు?. ఈవీఎం పగులకొడితే వీఆర్‌వో ఫిర్యాదు ఇవ్వడం ఏంటి?. వెబ్ క్యాస్టింగ్ పెట్టాం. అక్కడ ఆర్‌వో కలెక్టర్, ఇక్కడ నేను చూస్తానని సీఈవో మీనా చెప్పారు. కానీ మీరు ఏమి చూశారు?. 13 తేదీ పగిలితే మీకు వెంటనే తెలియాలి కదా? వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని అడిగాము. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఎమ్మెల్యేను పట్టుకోవాలని కదా?. ఈవీఎంని పగులగొట్టిన ఎమ్మెల్యేని, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ రెక్కలు విరిచి పట్టుకోవాలి కదా? ఎందుకు పట్టుకోలేదు?. మాచర్ల సమస్యాత్మక ప్రాంతమని కేంద్ర బలగాలు పంపించారు. మాచర్లకి సెంట్రల్ ఫోర్స్ వస్తే ఇక్కడ ఎందుకు సెంట్రల్ ఫోర్స్ పెట్టలేదు?. సెంట్రల్ ఫోర్స్ ఉంటే ఈవీఎం పగులగొట్టిన వెంటనే ఫైరింగ్ ఓపెన్ చేసేవాళ్ళు. ఎమ్మెల్యేని తుపాకీతో కొట్టేవాళ్ళు. కావాలనే అక్కడ సెంట్రల్ ఫోర్స్ పెట్టాలేదా?. అక్కడ సెంట్రల్ ఫోర్స్ పెట్టవద్దని ఎవరైనా చెప్పారా.? అని అడిగితే సీఈవో నుంచి సమాధానం లేదు. పగులగొట్టిన తర్వాత ఫిర్యాదు చేయడానికి అన్ని రోజుల ఎందుకు సమయం పట్టింది?. పీవో డైరీలో రాశాడా? లేదా?. ఎమ్మెల్యే వచ్చి పగలగొడితే గుర్తు తెలియని వ్యక్తులు అని ఫిర్యాదులో ఎందుకు ఇచ్చారు? కలెక్టర్ ఎందుకు చెప్పలేదు?. ఆర్‌వో ఎందుకు చెప్పలేదు. ఎవరు ఆ ఆర్‌వో?’’ అని ప్రశ్నించామని వర్ల రామయ్య చెప్పారు.


పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశామని తెలిపారు. ఈవీఎం పగులగొట్టిన తర్వాత అతడిని ఎందుకు అరెస్టు చేయలేదు? హౌస్ అరెస్టు చేయడం ఏంటి? అరెస్టు చేయాలి కదా? అని ప్రశ్నించామని తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకోవాలనికి సహకరించిన పోలీసు అధికారులు ఎవరు? వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని అడిగామని చెప్పారు. డీఐజీ సహకరించాడా? ఎస్పీ సహాకరించాడా? అని ప్రశ్నించామని చెప్పారు.


ఇక కౌంటింగ్‌కి సంబందించి ప్రతి 500 ఓట్లకి ఒక టేబుల్ ఏర్పాటు చేయాలని కోరామని వర్ల రామయ్య తెలిపారు. ఎన్ని టేబుళ్ళు ఏర్పాటు చేస్తున్నారో తెలియజేయాలని అడిగామని, అధికారుల తప్పిదాల కారణంగా జరిగిన పొరపాట్లను పరిగణనలోకి తీసుకోకుండా ప్రతి పోస్టల్ బ్యాలెట్ ఓటును పరిగణనలోకి తీసుకోవాలని కోరామని రామయ్య చెప్పారు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయి ఉండి... కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొకడిని లేపేస్తానని అనడం ఏంటని ప్రశ్నించారు. ‘‘ఎవడిని లేపేస్తాడు?. ఏమి లేపుతాడు?. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాదిరిగా అతను కూడా లేచిపోకముందే అతన్ని సిట్ అధికారులు అరెస్టు చేయాలి. రేవ్ పార్టీలో ఆయన కార్ దొరికిందంట?. చైతన్య అనే డీఎస్పీ తాడిపత్రిలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. వికలాంగులపై కూడా చేయి చేసుకున్నాడు. అతడిని సస్పెండే కాదు కేసు పెట్టి అరెస్టు చేయాలని కోరుతున్నాం. తాడిపత్రిలో అన్నింటికీ కారణం చైతన్య డీఎస్పీనే. కానీ అతమీ మీద ఇంతవరకు చర్యలు లేవు’’ అని వర్ల రామయ్య అన్నారు.

ఇవి కూడా చదవండి..

మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ డిస్మిస్

AP News: సీఈసీ పర్యవేక్షణలోనే కౌంటింగ్ చేపట్టాలి: దేవినేని ఉమ

For more Election News and Telugu News

Updated Date - May 23 , 2024 | 08:04 PM