Home » Vijayawada
అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ఆయన ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం ఉదయం సిఐడి విచారణకు హాజరయ్యారు. అతనితో పాటు మరో ఐదుగురు కూడా హాజరయ్యారు.
ఆర్థిక, ఐటీ, టూరిజం హబ్‌గా గుర్తింపు పొందిన విశాఖకు విమాన సర్వీసులు తగ్గిపోతుండటంపై అసంతృప్తి వెల్లువెత్తుతోంది. మే 1 నుంచి మలేసియా, బ్యాంకాక్ సర్వీసులు నిలిపివేయడంతో అంతర్జాతీయ సర్వీసుల సంఖ్య ఒక్కటికే పరిమితమైంది
వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిట్ విచారణకు హాజరుకాలేదు
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి సిట్ మూడోసారి నోటీసు జారీ చేసింది. మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్వర్క్ నిర్వహణలో కీలకంగా ఉన్నాడని ఆధారాలు లభించాయి. దీంతో బుధవారం విచారణకు రావాలంటూ సెట్ అధికారులు నోటీసు ఇచ్చారు.
అమెరికాలోని ప్రముఖ ఫెడరల్ సంస్థ ‘ఫ్యానీ మే’ లో తెలుగు ఉద్యోగులపై అక్రమాల ఆరోపణలతో 700 మందిని తొలగించారు. ‘తానా’, ‘ఆటా’ Telugu సంఘాలతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగం చేసినట్లు సంస్థ వెల్లడించింది
వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు వంశీని జైలుకు తరలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘంతో సీఎం చంద్రబాబు నాయుడు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు కింద వైద్య సేవలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
సరస్వతి పవర్ షేర్ల విషయంలో జగన్ మోహన్ రెడ్డితో తనకున్న వివాదంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే మీడియా ప్రతినిధుల తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు.
పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ అనుమానాస్పద మృతి కేసులో కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, విజయవాడ చేరుకునే ముందే కీసర టోల్‌ప్లాజా సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడిపోయినట్లు నిర్ధారణ అయింది
ప్రయాణికులకు ఎన్హెచ్ఏఐ శుభవార్త చెప్పింది. టోల్ ట్యాక్స్‌ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ హైవే మార్గంలో ప్రయాణించే వారికి ఇది భారీ ఊరట అని చెప్పవచ్చు.