Home » Vijayawada
Andhrapradesh: వ్యాపారస్తుల సపోర్ట్‌తో మళ్ళీ అధికారంలోకి మోడీ గవర్నమెంట్ వచ్చిందని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్ట్ 22న ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ఆందోళన చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ సంస్థలను ఆదానీకి పనికొచ్చే విధంగా మార్పు చేశారని విమర్శించారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. హోంశాఖ, రవాణ, యువజన సర్వీసుల శాఖలపై ఆయన సమీక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చలు జరుపుతారు. ఆస్పత్రులలో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సీఎం సమీక్ష జరుపుతారు.
Andhrapradesh: అనాథాశ్రమంలో కలుషిత ఆహారంతో నలుగురు విద్యార్థుల మృతిచెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Andhrapradesh: ప్రసిద్ధి పుణ్యక్షత్ర ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు జరుగతుండటం ఆనవాయితీగా వస్తోంది.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉండవల్లి నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయయలుదేరి వెళ్లనున్నారు. ఆపై తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి శ్రీ సిటీకి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్ళనున్నారు.
Andhrapradesh: తూర్పు నియోజకవర్గం పటమట హైస్కూల్ వద్ద అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన, మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. పేదల కడుపు నింపే లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు.
విజయవాడ: దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నామని, 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
Andhrapradesh: దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం నాడు విజయవాడ ఏపీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని షర్మిల ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంచి భోజన ప్రియుడు. పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయం చెప్పారు. విజయవాడలో మండవాస్ హోటల్ చాలా ఫేమస్. వెంకయ్య నాయుడు బుధవారం మండవాస్ హోటల్ వచ్చారు. హోటల్ యజమాని మండవ వెంకట రత్నం సాదరంగా స్వాగతం పలికారు. హోటల్లో తెలుగు వంటకాల రుచిని వెంకయ్య నాయుడు చూశారు.
డ్రగ్ ఫెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్‌తో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. సోమవారం నాడు మస్తాన్‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. హైదరాబాద్‌లో డ్రగ్ సప్లై, కస్టమర్లు వ్యవహారంపై ఆరా తీశారు. ఈ టైమ్‌లోనే మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వెలుగుచూశాయి...