Home » Vikarabad
లగచర్ల దాడి ఘటన కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని శనివారం పోలీసులు విచారించారు.
వికారాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను కన్నీరు పెట్టించింది. పలు ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షం దెబ్బకు తడిచిపోయింది. ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానావస్థలు పడ్డారు.
వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు, బొలేరో వాహనం ఢీ కొన్న ఘటనలో బొలేరో ఎదురుగా వస్తున్న బైక్పై పడింది. బైక్పై ఉన్న ఇద్దరు మృతి చెందగా బొలేరో వాహనంలో ఉన్న మద్యం లోడ్ నేలపాలైంది.
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బహుళార్ధ సాధక పారిశ్రామికవాడ(మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్) ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా విలేజ్ స్థానంలో పారిశ్రామిక పార్క్ వస్తోంది. ఈ మేరకు శుక్రవారం రద్దయిన నోటిఫికేషన్ స్థానంలో శనివారం కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు.
లగచర్లలో అధికారులపై దాడి జరిగిన కేసులో రైతులు, ఇతర నిందితుల పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
భూసేకరణ కోసం ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన అధికారులపై దాడి ఎలా జరిగిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం.. కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిని ప్రశ్నించారు.
లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ కొనసాగుతోంది. ఇటు రెవెన్యూ, పోలీసు అధికారులతోపాటు అటు సంగారెడ్డి జైలులో రిమాండ్లో ఉన్న లగచర్ల గ్రామస్థులను మానవ హక్కుల సంఘం బృందం ఆదివారం వేర్వేరుగా విచారించింది.
ప్రముఖ సినీ నటుడు మొహ్మద్ అలీకి వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎకమామిడి పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలీకి ఎకమామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధి సర్వే నెం.345లో వ్యవసాయ క్షేత్రం ఉంది.
సినీ నటుడు అలీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలంలోని ఎక్ మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో అలీకి భూమి, ఫామ్హౌస్ ఉంది. అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు నోటీసు ఇచ్చారు.