Home » YSR Congress
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత మరుసటి రోజు నుంచే వైసీపీ షాక్‌లు మొదలయ్యాయి. నాడు మొదలైన బిగ్ షాక్‌లు నేటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రోజుకో నేత.. రెండ్రోజులకో ఇద్దరు ఎంపీలు రాజీనామాతో దెబ్బ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది...
పార్టీ ఎంపీలు, నేతలు గుడ్‌బై చెబుతున్న తరుణంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ వచ్చే నెల 3న సతీసమేతంగా లండన్ బయల్దేరుతున్నారు..
వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ.. ఆ పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో విసిగివేసారిపోయిన ఆయన గుడ్ బై చెప్పేశారు.. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేర్లు ప్రస్తావించి మరీ.. ఇద్దరి మధ్య ఉన్న తేడాలను కూడా చెప్పుకొచ్చారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ పార్టీ నేతలు భారీ షాకిచ్చారు.
వైసీపీ (YSR Congress) అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోయారు..! మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అడ్డు అదుపూ లేకుండా ప్రవర్తించారు. వైసీపీ నేతల అరాచకాలతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇబ్బంది పడినన వారే అన్నది జగమెరగిగిన సత్యేమనని 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమైంది...
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అటవీ శాఖ మాత్రం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇలాకా గానే కొనసాగుతోంది. ఈ శాఖలోని కొందరు కీలక అధికారులు ఇంకా గత వైసీపీ ప్రభుత్వం నాటి తీరునే కొనసాగిస్తున్నారు...
ఈ నెల 4న ‘లేటరైట్ రైట్..’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
గ్రామ/వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రే విడుదల కావాల్సి ఉంది. అయితే.. పిన్నెల్లి రిలీజ్‌కు బ్రేక్ పడింది..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు-23న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది...