Home » Telangana » Assembly Elections
తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత చోటు చేసుకుంది. 119 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
కర్నాటక డిప్యూటి సీఎం, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ కౌంటింగ్ సరళిని డీకే పరిశీలించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ అలెర్ట్‌గా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫలితాల తర్వాత అవసరమనుకుంటే ఎమ్మెల్యేలను క్యాంప్‌కు పంపాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని టీపీసీసీ అధినేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party )పై ఉన్న అభిమానంతో ప్రజలు తమ పక్షాన నిలిచారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేసిన ప్రజలకు సహకరించిన మీడియాకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ) ధరణిలో ఉన్న భూములను రాత్రికి రాత్రే పేర్లు మారుస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ( Madhuyashkigoud ) వ్యాఖ్యానించారు.
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 3న భవితవ్యం తేలనుంది. అయితే ఫలితాలు రాకముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 4న డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టారు.
Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా నిన్న(నవంబర్ 30)న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చిన ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు బీఆర్‌ఎస్ నేతలను ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పలువురు అభ్యర్థులు, సీనియర్ నేతలు భేటీ అయ్యారు.
తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ అహర్నిశలు శ్రమించాయి. ఈసారి 70కు పైగా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో 70.74 శాతం పోలింగ్ ( Polling ) అయిందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఈసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. గతం కంటే 3 శాతం పోలింగ్ తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 పోలింగ్ శాతం నమోదయిందని చెప్పారు. 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు.
2023 తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదును అధికారులు పట్టుకున్నారు. రికార్డ్ స్థాయిలో రూ. 756 కోట్లను ఎన్నికల కమిషన్ సీజ్ చేసింది. ఎన్నికల కోడ్‌లో ఐటీ, ఈడీ, పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. పెద్దగా అధికార పార్టీ కి చెందిన నగదు సీజ్ కాకపోవడం వెనుక ఉన్న మర్మం ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు.