Bhatti Vikramarka: కౌంటింగ్ పూర్తయ్యే వరకు క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2023-12-01T20:23:23+05:30 IST
కాంగ్రెస్ పార్టీ ( Congress party )పై ఉన్న అభిమానంతో ప్రజలు తమ పక్షాన నిలిచారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేసిన ప్రజలకు సహకరించిన మీడియాకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ( Congress party )పై ఉన్న అభిమానంతో ప్రజలు తమ పక్షాన నిలిచారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేసిన ప్రజలకు సహకరించిన మీడియాకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ధరణిలో తప్పుడుగా నమోదు చేస్తున్నారు. అనంతరం వేరే వ్యక్తుల పేర్ల మీదకు మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. రైతులకు రైతుబంధు పథకాన్ని నిలిపివేసిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.
ఆ నిధులను కాంట్రాక్టర్లకు మళ్లిస్తున్నారు
‘‘రాష్ట్రంలో అభివృద్ధి నిధులను పనులు పూర్తి కాకుండానే కాంట్రాక్టర్లకు దారి మళ్లించే చర్యలు చేపడుతున్నారు. ఒక ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వం మారుతున్న క్రమంలో ఇష్టరాజ్యoగా వ్యవహరించకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమతంగా ఉండాలి. రాష్ట్రంలో గత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ధర్మపురి, హుజూర్‌నగర్, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో ఇబ్బందులు నెలకొన్నాయి. ప్రస్తుతం కోర్టులల్లో కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయి. కావున కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు మార్పు కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది’’ అని భట్టి విక్రమార్క సూచించారు