భానుపురి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): మామిడి సాగు చేసిన రైతులను మండీ వ్యాపారులు ధరల కోతలు విధించి నడ్డివిరుస్తున్నారు. సిండికేట్‌గా మారి ధరలను తగ్గిస్తున్నారు.
ఇంటి నుంచి కాలు కదపకుండా స్మార్ట్‌ఫోన ద్వారానే సేవలు పొందేలా ట్రాన్సకో తన యాప్‌ను ఆధునికీకరించింది.
భువనగిరిలోని డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం 2.55 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను కలెక్టర్ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆయన డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను మంగళవారం పరిశీలించారు.
రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తేగానే తూకంవేసి రైతులకు అక్కడే బిల్లు రశీదు ఇస్తారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. మంగళవారం మండలంలోని మాసాయిపేట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
తుర్కపల్లి మండలంలో ఈ నెల 3వ తేదీన భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి రైతులు, మామిడి తోటల యాజమానులకు భారీ నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో వడగళ్ల వాన రైతుల కు కన్నీరు మిగిల్చింది.
రేషన్ దుకాణాలు బహుదూరం ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో నూతన గ్రామపంచాయతీలు ఏర్పడిన నాటి నుంచి పరిస్థితులు మరింత జటిలంగా మారాయి.
ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ నూతన విధానంతో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది.
హోటళ్లు, దాబాలు నిబంధనల ప్రకారం రాత్రి 10.30 గంటల లోపు మూసి వేయాల్సి ఉండగా హైదరాబాద్- వరంగల్ 163వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటినా యఽథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీర్చకపోవడంతోనే సమ్మె నోటీస్ ఇచ్చినట్లు తెలంగాణ మజ్దూర్ యూనియన రాష్ట్ర కార్యదర్శులు బుడిగ పుల్లయ్య, సుంకరి శ్రీనివాస్ అన్నారు.