హోటళ్లు, దాబాలు నిబంధనల ప్రకారం రాత్రి 10.30 గంటల లోపు మూసి వేయాల్సి ఉండగా హైదరాబాద్- వరంగల్ 163వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటినా యఽథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీర్చకపోవడంతోనే సమ్మె నోటీస్ ఇచ్చినట్లు తెలంగాణ మజ్దూర్ యూనియన రాష్ట్ర కార్యదర్శులు బుడిగ పుల్లయ్య, సుంకరి శ్రీనివాస్ అన్నారు.
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించడం సరైందేనని ఆ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ హుజూర్‌నగర్‌కు చెందిన మాలోతు రవీందర్‌నాయక్ అన్నారు.
కోదాడ మండలంలో సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మామిడి పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ప్రపంచ పర్యాటక కేంద్రం, అంతర్జాతీయ బౌద్ధక్షేత్రమైన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని బుద్ధవనం ప్రాజెక్టులో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
పేద రైతుల బతుకు పోరాటంగా నిలిచి, నేతల హామీలు, పోలీసుల పహారాలు, నిత్యం ఆందోళనలు, ఆవేదనలు, ఆశా, నిరాశలతో నిండిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలోని 540 సర్వేనెంబరులోని భూసమస్యకు నేటికీ పరిష్కారం లభించలేదు.
భువనగిరి మండల వ్యాప్తంగా ఉన్న భూ పంపిణీపై నిషేధం ఎత్తివేసి పేద రైతులకు వ్యవసాయ భూములు, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధరణి పోర్టల్‌లో లోపాలు అధికారులకు వరంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభు త్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా అనేకమంది వీఆర్వోల సహకారంతో పోర్టల్‌లో తమకు భూమి లేనప్పటికీ నమోదు చేసుకున్నారు.
రైతులు పండించిన ప్రతీధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.
యాసంగి సీజన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కో కేంద్రానికి కమ్యూనిటీ కోఆర్డినేటర్ల(సీసీ)లను ఇనచార్జిగా నియమించారు.