దళితులపై దాడులన్నీ జగన్‌కు తెలిసే జరుగుతున్నాయి: పీతల సుజాత
ABN , First Publish Date - 2020-08-31T23:21:44+05:30 IST
దళితులపై దాడులన్నీ సీఎం జగన్‌కు తెలిసే జరుగుతున్నాయని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. దళితులకు ఇంతటి దారుణ పరిస్థితి కల్పించిన.. జగన్ ప్రభుత్వ అరాచకాలపై సీబీఐ

విజయవాడ: దళితులపై దాడులన్నీ సీఎం జగన్‌కు తెలిసే జరుగుతున్నాయని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. దళితులకు ఇంతటి దారుణ పరిస్థితి కల్పించిన.. జగన్ ప్రభుత్వ అరాచకాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలపై సీఎం ఎందుకు స్పందించడంలేదు? అని ప్రశ్నించారు. శిరోముండనాన్ని ప్రజలకు పరిచయం చేసింది జగన్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. దళితులను వైసీపీ ఓటు బ్యాంకుగానే చూస్తోందని సుజాత విమర్శించారు.