రేవుపోలవరం తీరంలో స్వామి వివేకానంద విగ్రహం
ABN , First Publish Date - 2021-06-11T22:11:34+05:30 IST
జిల్లాలోని ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్రతీరంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక యువత ఏర్పాటు చేశారు.

వైజాగ్: విశాఖ జిల్లాలోని ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్రతీరంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థానిక యువత ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలోని ఉమామాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామ యువత ఏర్పాటు చేసిన స్వామిజీ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామి శ్రీనివాసానందను శాలువతో యువత సన్మానించారు. యువకుల కృషిని శ్రీనివాసానంద స్వామి అభినందించారు. యువతా మేలుకో అంటూ స్వామి వివేకానంద స్ఫూర్తిని వారిలో నింపారు.