పతకంతో తిరిగి రావాలనుకున్నా.. బాధగా ఉంది: మేరీకోమ్
ABN , First Publish Date - 2021-08-01T07:12:54+05:30 IST
పతకం లేకుండా స్వదేశానికి రావడం బాధగా ఉందని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ..

పతకం లేకుండా స్వదేశానికి రావడం బాధగా ఉందని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పతకం గెలిచి దేశానికి రావాలనుకున్నానని, కానీ వట్టి చేతులతో తిరిగి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. అయితే తాను బాక్సింగ్‌ను మాత్రం అప్పుడే వదిలిపెట్టనని, కచ్చితంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ‘పతకంతో భారత్‌లో అడుగుపెట్టాలనుకున్నా. కానీ సాధ్యం కాలేదు. బాధగా ఉంది’ అని మేరీకోమ్ పేర్కొన్నారు.
కాగా.. టోక్యో ఒలింపిక్స్‌లో మేరీకోమ్ ఇటీవల జరిగిన పోటీల్లో ఓటమి పాలయ్యారు. ఫ్లై వెయిట్ ఛాంపియన్ షిప్లో భాగంగా 48-51 కేజీల విభాగంగా పోటీపడిన మేరీకోమ్.. రౌండ్ 32లో విజయంతో రౌండ్ 16లోకి ప్రవేశించారు. కానీ అక్కడ అనూహ్యంగా ఓటమి చవి చూశారు. అయితే జడ్జిల తప్పువల్లే తాను ఓడిపోయానని మేరీకోమ్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.