కోల్‌కతా వైభవంగా
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:24 AM
భారీ స్కోర్లకు మారుపేరుగా నిలిచే సన్‌రైజర్స్ హైదాబాద్‌కు ముచ్చటగా మూడో ఓటమి. ఎప్పటిలాగే మరోసారి బ్యాటర్ల వైఫల్యం రైజర్స్‌ను దెబ్బతీసింది. అటు ముంబై చేతిలో ఘోర ఓటమి తర్వాత...

ఐపీఎల్‌లో నేడు
వేదిక లఖ్‌నవూ, రా.7.30
లఖ్‌నవూ X ముంబై
80 రన్స్‌తో ఘన విజయం
సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్ ఓటమి
చెలరేగిన వెంకటేశ్ అయ్యర్
వైభవ్ ఆరోరా, వరుణ్‌లకు మూడేసి వికెట్లు
కోల్‌కతా: భారీ స్కోర్లకు మారుపేరుగా నిలిచే సన్‌రైజర్స్ హైదాబాద్‌కు ముచ్చటగా మూడో ఓటమి. ఎప్పటిలాగే మరోసారి బ్యాటర్ల వైఫల్యం రైజర్స్‌ను దెబ్బతీసింది. అటు ముంబై చేతిలో ఘోర ఓటమి తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మాత్రం ఘనంగా పుంజుకుంది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన ఈ జట్టు గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రైజర్స్‌పై కేకేఆర్‌కు ఇది వరుసగా ఐదో గెలుపు. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60), రఘువంశీ (32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) అర్ధసెంచరీలతో సత్తా చాటగా, కెప్టెన్ అజింక్యా రహానె (27 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 38), రింకూ సింగ్ (17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 32 నాటౌట్) అదరగొట్టారు. ఛేదనలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (3/22), పేసర్ వైభవ్ అరోరా (3/29)ల ధాటికి సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ (33), కమిందు మెండిస్ (27) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా వైభవ్ అరోరా నిలిచాడు.
వికెట్లు టపటపా..: భారీ ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు తీసిన కేకేఆర్ బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ధనాధన్ హిట్టింగ్‌తో చెలరేగే ఓపెనర్లు హెడ్ (4), అభిషేక్ (2)లతో పాటు ఇషాన్ కిషన్ (2) తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్ చేరారు. అప్పటికి జట్టు స్కోరు 9 పరుగులు మాత్రమే. తొలి మ్యాచ్ ఆడిన పేసర్ వైభవ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే హెడ్‌ను అవుట్ చేయగా.. తన తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్ పనిబట్టాడు. రెండో ఓవర్‌లో అభిషేక్‌కు హర్షిత్ రాణా షాకిచ్చాడు. ఈ దశలో నితీశ్ (19), కమిందు నాలుగో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. ఏడో ఓవర్‌లో కమిందు 6,4,6తో చెలరేగినప్పటికీ నితీశ్ వికెట్‌ను కోల్పోయింది. కుదురుకున్నట్టు కనిపించిన కమిందు స్పిన్నర్ నరైన్ ఓవర్‌లో వెనుదిరిగాడు. ఇక, వరుణ్ రాకతో రైజర్స్ ఇబ్బందులు పెరిగాయి. ముందుగా అనికేత్ (6)ను వరుణ్ అవుట్ చేశాడు అయితే క్రీజులో క్లాసెన్ ఉండడంతో రైజర్స్ ఆశలు వదులుకోలేదు. అందుకు తగ్గట్టే అతడు కూడా భారీ షాట్లతో చెలరేగాడు. 14వ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో జోరు చూపాడు. కానీ వైభవ్ అతడిని కూడా వెనక్కి పంపి కేకేఆర్ విజయాన్ని ఖాయం చేశాడు. ఆ తర్వాత 16వ ఓవర్‌లో వరుణ్ వరుసగా రెండు వికెట్లు తీయగా.. ఆ వెంటనే రస్సెల్ చివరి వికెట్‌ను పడగొట్టి 20 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.
చివర్లో జోరు..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు డికాక్ (1), నరైన్ (7) మరోసారి విఫలమయ్యారు. 16 పరుగులకే ఈ జోడీ వెనుదిరిగినా మిడిలార్డర్ ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే 15వ ఓవర్లలో జట్టు 122/4తో ఉన్న దశలో 180 స్కోరు కూడా కష్టమే అనిపించింది. కానీ చివర్లో వెంకటేశ్ అయ్యర్ విధ్వంసానికి జట్టు అద్భుతంగా పుంజుకుని సవాల్ విసిరే స్కోరు సాధించింది. డెత్ ఓవర్లలో రైజర్స్ బౌలర్ల వైఫల్యం కారణంగా ఆఖరి ఐదు ఓవర్లలో కేకేఆర్ 78 పరుగులు రాబట్టింది. ఆరంభంలో కెప్టెన్ రహానె ఎదురుదాడికి దిగి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అతడికి యువ బ్యాటర్ రఘువంశీ చక్కటి సహకారం అందించడంతో కేకేఆర్ స్కోరు గాడిన పడింది. రహానె వీలుచిక్కినప్పుడల్లా అద్భుత సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. వీరి జోరుకు పవర్‌ప్లేలో 53/2 స్కోరుతో ఫర్వాలేదనిపించింది. 11వ ఓవర్‌లో రఘువంశీ వరుసగా 6,4 బాదినా.. రహానె వికెట్‌ను కోల్పోయింది. దీంతో మూడో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన రఘువంశీని స్పిన్నర్ కమిందు అవుట్ చేశాడు. ఐపీఎల్‌లో అతడికిదే తొలి వికెట్. అంతకుముందే అతడిచ్చిన సులువైన క్యాచ్‌ను నితీశ్ జారవిడిచాడు. ఈ స్థితిలో వెంకటేశ్ అయ్యర్-రింకూ సింగ్ జోడీ బాధ్యత తీసుకుంది. అయితే పిచ్‌ను అర్థం చేసుకునేందుకు వీరు కాస్త సమయం తీసుకోవడంతో 12-15 ఓవర్ల మధ్య 25 పరుగులే వచ్చాయి. కానీ 16వ ఓవర్‌లో చెరో ఫోర్‌తో పరుగుల వేట మొదలైంది. హర్షల్ వేసిన ఆ ఓవర్‌లో రింకూ హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. 18వ ఓవర్‌లో అయ్యర్ 4,4.. రింకూ సిక్సర్‌తో 17 రన్స్ వచ్చాయి. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లోనైతే అయ్యర్ 4,6,4,4తో 21 రన్స్ రాబట్టాడు. అటు 25 బంతుల్లోనే ఎస్‌ఆర్‌హెచ్‌పై వరుసగా మూడో ఫిఫ్టీని కూడా పూర్తిచేశాడు. అలాగే చివరి ఓవర్‌లో తొలి రెండు బంతులను 6,4గా మలిచినా మూడో బంతికి అనికేత్ క్యాచ్‌తో అయ్యర్ వెనుదిరిగాడు. అప్పటికే ఐదో వికెట్‌కు 41 బంతుల్లోనే 91 పరుగుల భారీ భాగస్వామ్యం జత చేరింది. ఇదే ఓవర్‌లో రస్సెల్ (1) రనౌటైనా 13 రన్స్ చేసిన కేకేఆర్ 200 మార్క్‌ను అందుకోగలిగింది.
స్కోరుబోర్డు
కోల్‌కతా: డికాక్ (సి) జీషన్ (బి) కమిన్స్ 1, నరైన్ (సి) క్లాసెన్ (బి) షమి 7, రహానె (సి) క్లాసెన్ (బి) జీషన్ 38, రఘువంశీ (సి) హర్షల్ (బి) కమిందు 50, వెంకటేశ్ (సి) అనికేత్ (బి) హర్షల్ 60, రింకూ (నాటౌట్) 32, రస్సెల్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 200/6; వికెట్ల పతనం: 1-14, 2-16, 3-97, 4-106, 5-197, 6-200; బౌలింగ్: షమి 4-0-29-1, కమిన్స్ 4-0-44-1, సిమర్‌జీత్ 4-0-47-0, జీషన్ 3-0-25-1, హర్షల్ 4-0-43-1, కమిందు 1-0-4-1.
సన్‌రైజర్స్: హెడ్ (సి) హర్షిత్ (బి) వైభవ్ 4, అభిషేక్ (సి) వెంకటేశ్ (బి) హర్షిత్ 2, ఇషాన్ (సి) రహానె (బి) వైభవ్ 2, నితీశ్ (సి) నరైన్ (బి) రస్సెల్ 19, కమిందు (సి/సబ్) అనుకూల్ (బి) నరైన్ 27, క్లాసెన్ (సి) అలీ (బి) వైభవ్ 33, అనికేత్ (సి) వెంకటేశ్ (బి) వరుణ్ 6, కమిన్స్ (సి) హర్షిత్ (బి) వరుణ్ 14, హర్షల్ (సి అండ్ బి) రస్సెల్ 3, సిమర్‌జీత్ (బి) వరుణ్ 0, షమి (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 16.4 ఓవర్లలో 120 ఆలౌట్; వికెట్ల పతనం: 1-4, 2-9, 3-9, 4-44, 5-66, 6-75, 7-112, 8-114, 9-114, 10-120; బౌలింగ్: వైభవ్ అరోరా 4-1-29-3, హర్షిత్ రాణా 3-0-15-1, వరుణ్ చక్రవర్తి 4-0-22-3, రస్సెల్ 1.4-0-21-2, నరైన్ 4-0-40-1.
1
ఐపీఎల్‌లో రైజర్స్‌కిదే భారీ పరాజయం (80 రన్స్ తేడా).
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
పంజాబ్ 2 2 0 0 4 1.485
ఢిల్లీ 2 2 0 0 4 1.320
బెంగళూరు 3 2 1 0 4 1.149
గుజరాత్ 3 2 1 0 4 0.807
కోల్‌కతా 4 2 2 0 4 0.070
ముంబై 3 1 2 0 2 0.309
లఖ్‌నవూ 3 1 2 0 2 -0.150
చెన్నై 3 1 2 0 2 -0.771
రాజస్థాన్ 3 1 2 0 2 -1.112
హైదరాబాద్ 4 1 3 0 2 -1.612
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..