ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

ABN , First Publish Date - 2021-12-24T05:41:46+05:30 IST

ఖానాపూర్‌ మండలంలోని మస్కాపూర్‌ గ్రామంలో గురువారం బీజేపీ నాయకులు రైతు దినోత్సవ వేడుకలు జరుపు కున్నారు.

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
రైతులకు స్వీట్స్‌ తినిపిస్తున్న దృశ్యం

జిల్లాలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా గురువారం జరుపుకున్నారు. బీజేపీ నాయకులు రైతులను అభినందించి మిఠాయిలు తినిపించారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి రైతులను అభినందించి వారి పనుల్లో పాలుపంచుకున్నారు. కొన్ని సంస్థలు రైతులను సన్మానించాయి. 

ఖానాపూర్‌ రూరల్‌ : ఖానాపూర్‌ మండలంలోని మస్కాపూర్‌ గ్రామంలో గురువారం బీజేపీ నాయకులు రైతు దినోత్సవ వేడుకలు జరుపు కున్నారు. పంటపొలంలో పని చేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి మిఠాయిలు తినిపించారు. రైతులే దేశానికి వెన్నుముక అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు తోకల బుచ్చన్నయాదవ్‌, అంకం మహేందర్‌, ఆనంద్‌, పిట్టల భూ మన్న, శ్రావణ్‌కుమార్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ముథోల్‌ : మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామంలో గల ప్యూచర్‌ స్కూల్‌లో ఘనంగా జాతీర రైతు దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రంలోకి వె ళ్లి వరి నాట్లు వేసి, రతులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

కుంటాల : రైతులేనిదే రాజ్యంలేదని శాంతినిఖేతన్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ సంతో ష్‌, డైరెక్టర్‌ ప్రవీణ్‌లు అన్నారు.  మండల కేంద్రంలోని శాంతినికేతన్‌ పాఠశాలలో గురువారం రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఏర్పాటు చేసి న కార్యక్రమంలో మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలే అందరికి ఆహారంగా వస్తున్నాయని, దేశానికి రైతు వెన్నుముఖ అని పేర్కొన్నారు. రైతుల వేషాదారణలో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 రైతులకు ఘన సన్మానం

ఖానాపూర్‌ : దేశానికి అన్నంపెట్టేది రైతన్నేనని అటువంటి రైతు లేనిదే ఏ రాజ్యం లేదని వాసవిక్లబ్‌ జోన్‌ చైర్మన్‌ మహాజన్‌ జితేందర్‌ అన్నారు. ఖానాపూర్‌ వాసవిక్లబ్‌ ఆద్వర్యంలో గురువారం స్థానిక వాసవిమాత ఆలయంలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు రైతులను ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రైతన్నకు అండగా నిలిచేందకు సమాజంలో ప్రతి ఒక్కరు తమవంతు పాత్ర పోషించాలన్నారు. రైతు కష్టాల పాలైతే రాజ్యం కూడా కష్టాలపాలౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవిక్లబ్‌ జిల్లా నాయకులు బండారి విశ్వనాథన్‌, ప్రభాకర్‌, గన్నారపు రాజేందర్‌, ముక్క కిషన్‌, సతీష్‌, రమేష్‌, ధనంజయ్‌, రైతులు లచ్చన్న, శ్రీరాములు, నారాయణ, తిరుపతి, సుధాకర్‌, ఎర్రన్న తదితరులున్నారు. 

పొలం బాట పట్టిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

సోన్‌, డిసెంబరు 23 : మండలంలోని గంజాల్‌ గ్రామ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం పొలం బాట పట్టారు. రైతు దినోత్సవ సందర్భంగా పాఠశాల సమీపంలోని తోటలోకి వెళ్లి రైతులతో వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, వివిధ పంటల గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగి తెలుసుకున్నారు. పంటల మార్పిడి గురించి, ఎరువుల వాడకం, తదితర అంశాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం వ్యవసాయ తోటలో రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్‌ బాబు, ఉపాధ్యాయులు సునీత, రత్నమాల, ప్రమీల, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-24T05:41:46+05:30 IST