వైకుంఠపురంలో లక్ష తులసీ అర్చన

ABN , First Publish Date - 2021-07-21T05:09:38+05:30 IST

: తొలి ఏకాదశిని పురస్కరించుకుని సంగారెడ్డి శివారులోని శ్రీ వైకుంఠపురంలో మంగళవారం లక్ష తులసీ అర్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

వైకుంఠపురంలో లక్ష తులసీ అర్చన

 సంగారెడ్డిఅర్బన్‌: తొలి ఏకాదశిని పురస్కరించుకుని సంగారెడ్డి శివారులోని శ్రీ వైకుంఠపురంలో మంగళవారం లక్ష తులసీ అర్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకు లు కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీవారి మూలమూర్తికి పంచామృతాలు, పండ్ల రసాలు, పలువిధ పరిమళభరిత ద్రవ్యాలు, నదీజలాలు, తీర్థాలు, సముద్రజలాలను ఆవాహన చేసిన పవిత్రజలాలతో అభిషేకాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. గోవింద నామస్మరణ నడుమ పూర్ణాహుతి గావించారు.  ఆలయ ప్రాంగణంలో తులసి మొక్కలు నాటారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-21T05:09:38+05:30 IST