పేద ముస్లింలకు ప్రభుత్వం అండ
ABN , First Publish Date - 2021-01-08T04:14:22+05:30 IST
పేద ముస్లింలకు ప్రభుత్వం అండ

షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
వరంగల్‌రూరల్, జనవరి 7 : షాదీముబారక్ పేద ముస్లింలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట క్యాంప్ కార్యాలయంలో గురువారం 33 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నాయన్నారు. కార్య క్రమంలో ఆర్డీవో పవన్‌కుమార్, మునిసిపల్ చైర్‌పర్సన్ గుంటి రజని, వైస్‌చైర్మన్ ఎం.వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.