Share News

ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:00 AM

ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ‘జైౖ బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌’ నినాదానికి పిలుపుని చ్చారని నారాయణపేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి పిలుపుని చ్చారు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం
ప్రతిజ్ఞ చేస్తున్న ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, కాంగ్రెస్‌ నాయకులు

- జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ నినాదాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి

- ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి

నారాయణపేట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ‘జైౖ బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌’ నినాదానికి పిలుపుని చ్చారని నారాయణపేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి పిలుపుని చ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. రాజాంగ నిర్మాత అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా వ్యాఖ్య లు క్షమించరానివన్నారు. జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ ఆశయాలకు తగ్గట్టు రాష్ట్రంలో ప్రభు త్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుం దన్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ బిల్లు లు ఆమోదించిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్ర భుత్వం ప్రజాస్వామ్య విలువలు హరిస్తుందని విమర్శించారు. పార్లమెంట్‌లో విపక్షాలను మా ట్లాడనీయకుండా అణచివేయడం ప్రజాస్వా మ్యానికి హాని కలిగించే అంశమన్నారు. మహా త్మగాంధీ గౌరవాన్ని తగ్గించేలా పలు పార్టీలు చేస్తున్న కార్యక్రమాలను ఎండగట్టాలన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని తారు మారు చేయాలని చూస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పేలా కార్యకర్తలు ‘జైౖ బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌’ నినాదాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్య క్షుడు ప్రశాంత్‌రెడ్డి, కుంభం శివకుమార్‌ రెడ్డి, ధారాసింగ్‌, మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, వైస్‌ చైర్మన్‌ హన్మంతు, బండివేణుగోపాల్‌, నరహరి, బాల్‌ రెడ్డి, సలీం, సరాఫ్‌ నాగరాజ్‌, సుధాకర్‌, గౌస్‌, సాయి బాబ, మధుసూదన్‌రెడ్డి, మనోజ్‌, పవన్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:00 AM