Share News

Uttam Kumar Reddy: త్వరలో ఎస్‌ఎల్‌బీసీ పునః ప్రారంభం

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:12 AM

ఎల్‌ఎ్‌సబీసీ దుర్ఘటనతో పనులు నిలిచాయని, త్వరలోనే ఎస్‌ఎల్‌బీసీ పనులను తిరిగి ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని చెప్పారు.

Uttam Kumar Reddy: త్వరలో ఎస్‌ఎల్‌బీసీ పునః ప్రారంభం

  • చివరి గింజ పండే వరకు సాగర్‌ ఆయకట్టుకు నీరు అందిస్తాం: ఉత్తమ్‌

పాలకవీడు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఎ్‌సబీసీ దుర్ఘటనతో పనులు నిలిచాయని, త్వరలోనే ఎస్‌ఎల్‌బీసీ పనులను తిరిగి ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని చెప్పారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం డెక్కన్‌ సిమెంట్‌ కర్మాగారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామన్నారు. గత బీ ఆర్‌ఎస్‌ పాలకుల నిర్లక్ష్యంతో బ్రాహ్మణవెల్లెంల ప్రా జెక్టు వెనకబడిందని, దాన్ని పూర్తిచేస్తామని చెప్పా రు. నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ లిఫ్ట్‌లను పూర్తి స్థాయిలో మరమ్మతు చేయించి పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. నెమ్మికల్‌ ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేస్తామన్నారు. గంధమల్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని, వాల్‌ పుట్టింగ్‌లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కృష్ణానది నుంచి సాగర్‌కు వచ్చే నీటిలో కొంత కొరత ఉన్న మాట వాస్తవమేనన్న ఆయన గత ప్రభుత్వం నీటి వాటాను సరిగా వినియోగించుకోలేదని, ఈ పాపం వారిదేనని విమర్శించారు. శ్రీశై లం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తిని ప్రారంభించి ఐదు టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు తీసుకొస్తామన్నారు. చివరి గింజ పండేవరకు సాగర్‌ ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. రేషన్‌కార్డున్న వారికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 30 (ఉగాది) నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.


నల్లగొండ డ్రీమ్‌ ప్రాజెక్టు ఎస్‌ఎల్‌బీసీ

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఎస్‌ఎల్‌బీసీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని, దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.2వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో జిల్లా మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ గురించి తెలియదని విమ ర్శించారు. సూర్యాపేటలో కేటీఆర్‌ గాలి మాటలు మాట్లాడాడని, వాటిని ప్రజలు పట్టించుకోరన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకులే వందశాతం విజయం సాధిస్తారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె.జానారెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 04:12 AM