Share News

గిరిజనులకే హక్కులు కల్పించాలి

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:01 AM

మం డలంలోని సిర్సన గండ్ల సీతారా మచంద్రస్వామి దేవాలయంలో అ గ్రహారంతండా, గైరా న్‌తం డాకు చెందిన గిరిజనులు ఆదివారం ఎంపీ మల్లు రవిని కలిశారు.

గిరిజనులకే హక్కులు కల్పించాలి
ఎంపీ మల్లు రవిని కలిసిన గిరిజనులు

- ఎంపీ మల్లు రవికి గిరిజన సంఘం నాయకుడు సరిరాం నాయక్‌ విజ్ఞప్తి

చారకొండ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) మం డలంలోని సిర్సన గండ్ల సీతారా మచంద్రస్వామి దేవాలయంలో అ గ్రహారంతండా, గైరా న్‌తం డాకు చెందిన గిరిజనులు ఆదివారం ఎంపీ మల్లు రవిని కలిశారు. దేవా లయ భూములను ఎన్నో ఏళ్లుగా గిరి జనులం సాగు చేస్తున్నామని, వాటి పై తమకే పూర్తి హక్కులు కలిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీకి ఎంపీకి విన్నవించారు. గిరిజన సంఘం మండ ల నాయకుడు సరిరాం ఆధ్వర్యంలో గిరిజన రైతులు ఆదివారం హైదరాబాద్‌లో నాగర్‌కర్నూ ల్‌ ఎంపీ మల్లు రవిని ఆయన నివాసంలో కలి శారు. దేవాలయ భూములను సాగు చేసుకొం టున్న గిరిజనులకే హక్కులు కల్పించాలని విన తి పత్రం అంజేశారు. సానుకూలంగా స్పందిం చిన ఎంపీ మీ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారని సరిరాం నాయక్‌ తెలిపారు. ఎంపీ మల్లు రవిని కలిసి న వారిలో గిరిజన సంఘం మండల నాయకులు సంతోష్‌ నాయక్‌, శ్రీను నాయక్‌, రామ్‌లాల్‌ నాయక్‌, రవినాయక్‌, శివనాయక్‌ ఉన్నారు.

ఎంపీ మల్లు రవికి వినతి

మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కో రుతూ దేవాలయ మాజీ చైర్మన్‌ డేరం మల్లికా ర్జునశర్మ ఆదివారం ఎంపీ మల్లు రవిని కలిసి వినతి పత్రం అందజేశారు. దీంతో సానుకూ లంగా స్పందించిన ఎంపీ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇ చ్చారని ఆయన అన్నారు. ఏప్రిల్‌లో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని ఎంపీ మల్లు రవికి మల్లికార్జున శర్మ ఆహ్వానం అందించారు.

Updated Date - Mar 24 , 2025 | 12:01 AM