Share News

Mahesh Kumar Goud: రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనుగడ

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:17 AM

రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశ మనుగడ సాధ్యమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ, మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

Mahesh Kumar Goud: రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనుగడ

  • గాంధేయ మార్గంలో ఊరూరా పాదయాత్రలు చేపట్టాలి

  • పనిచేయని పార్టీ నేతలపై చర్యలు: మహేశ్‌ గౌడ్‌

రంగారెడ్డి అర్బన్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశ మనుగడ సాధ్యమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ, మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మతవాదుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే.. మరోసారి గాంఽధేయ మార్గంలో ‘జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్‌’ పేరుతో గ్రామాల్లో పాదయాత్రలు చేపట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ‘జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్‌’ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మహేశ్‌గౌడ్‌ హాజరై మాట్లాడారు. ‘జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని చెప్పారు.


ఈ కార్యక్రమాన్ని పార్టీశ్రేణులు విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేసి అంబేడ్కర్‌ గొప్పతనాన్ని చాటి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవిస్తూ పార్టీ కోసం పనిచేయని నాయకులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే పాదయాత్రలు చేపట్టి ప్రజల సమస్యలను గుర్తించి పనిచేయాలని కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమ పి లుపునిచ్చారు. ‘జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్‌లో సికింద్రాబాద్‌ పరిధిలోని ఐదు ని యోజకవర్గాల నేతల సన్నాహాక భేటీలో వారు పాల్గొని మాట్లాడారు.

Updated Date - Mar 24 , 2025 | 04:17 AM