Share News

విద్య కాషాయీకరణను వ్యతిరేకించాలి

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:03 AM

విద్యారం గాన్ని కాషాయీకరణ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావి ధానానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కా వాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాం త్‌ పిలుపునిచ్చారు.

విద్య కాషాయీకరణను వ్యతిరేకించాలి
ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలో మాట్లాడుతున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్‌

- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్‌

- జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభ

నాగర్‌కర్నూల్‌ టౌ న్‌, మార్చి23 (ఆంధ్రజ్యోతి) : విద్యారం గాన్ని కాషాయీకరణ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావి ధానానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కా వాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాం త్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ని బాబు జగ్జీవన్‌రాం భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నా లుగవ జిల్లా మహాసభలు నిర్వహించారు. సభ లకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాం త్‌ హాజరై ప్రసంగించారు. విద్యారంగంలో జ్యో తిష్యం, మూఢ విశ్వాసాలను చొప్పించి పాఠ్యపు స్తకాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్ర యత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో విద్య, వైద్యం, ఉపాధి దినదినానికి సామాన్యులకు అం దని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఆశిం చిన స్థాయిలో నిధులు కేటాయించలేదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యద ర్శులు ఎండీ.సయ్యద్‌, తారాసింగ్‌, నాయకులు శివకుమార్‌, జమాలుద్దీన్‌, జస్వంత్‌, ప్రవీణ్‌, కార్తీక్‌, ప్రణయ్‌, చరణ్‌, రాజేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:03 AM