నగరి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీసు యాక్టు
ABN , First Publish Date - 2022-12-06T00:10:34+05:30 IST
శాంతి భద్రతల దృష్ట్యా నగరి సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1961 అమలు చేస్తున్నట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు.
నగరి, డిసెంబరు 5: శాంతి భద్రతల దృష్ట్యా నగరి సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1961 అమలు చేస్తున్నట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో మతపరమైన విద్వేషాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా నగరి అర్బన్, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, వెదురు కుప్పం, ఎస్‌ఆర్ పురం, పాలసముద్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్టు అమలు చేస్తున్నా మన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంద న్నారు. ఈ రోజుల్లో ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు చేయరాదన్నారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదని పేర్కొన్నారు. అంత్యక్రియలకు మాత్రం సడలింపు ఉంటుందన్నారు.