జేఎన్టీయూకే అభివృద్ధికి మరింత సహకారం
ABN , First Publish Date - 2022-08-23T06:33:55+05:30 IST
జేఎన్టీయూకే, ఆగస్టు 22: కాకినాడ జేఎన్టీయూకే అభివృద్ధికి మరింత సహకారమందించాలని వర్సిటీ అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి ఉపకులపతి జీవీఆర్.ప్రసాదరాజు సూచించారు. వర్సిటీలోని వీసీ సమావేశహాల్లో విశ్వవిద్యాలయం 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజ

ఉపకులపతి ప్రసాదరాజు
జేఎన్టీయూకే, ఆగస్టు 22: కాకినాడ జేఎన్టీయూకే అభివృద్ధికి మరింత సహకారమందించాలని వర్సిటీ అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి ఉపకులపతి జీవీఆర్.ప్రసాదరాజు సూచించారు. వర్సిటీలోని వీసీ సమావేశహాల్లో విశ్వవిద్యాలయం 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతమైన సందర్భంగా డైరెక్టర్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. వర్సిటీలో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని త్వరలో జేఎన్టీయూకేలో స్నాతకోత్సవ భవనం, వసతిగృహాలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టనున్నామని తెలిపారు. సమావేశంలో రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్ ఎల్.సుమలత, డీఏఏ సీహెచ్ సాయిబాబు పలువురు డైరెక్టర్లు పాల్గొన్నారు.
వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఈఏపీసెట్ వెబ్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. మొదటిరోజు నుంచే ఏ ర్యాంకు వచ్చిన విద్యార్థి అయినా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో సంబంధిత వెబ్‌సైట్ సరిగా పనిచేయక తక్కువమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం నుంచి ప్రారంభమై ఈనెల 31 వరకూ కొనసాగుతుందని జేఎన్టీయూకేలోని సహాయకేంద్రం సమన్వయకర్త ఎన్.బాలాజీ తెలిపారు. వెబ్‌కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ 30వరకూ కొనసాగనుంది.