Pawan Kalyan Varahi: ‘వారాహి’కి లైన్ క్లియర్.. రంగుతో అసలు గొడవే లేదట.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-12-12T15:48:21+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. పవన్ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. పవన్‌ 'వారాహి' వాహనానికి..

Pawan Kalyan Varahi: ‘వారాహి’కి లైన్ క్లియర్.. రంగుతో అసలు గొడవే లేదట.. కారణం ఏంటంటే..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ‘వారాహి’ (Varahi) వాహనానికి లైన్ క్లియర్ అయింది. పవన్ వాహనానికి (Pawan Kalyan Varahi) అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు (Telangana RTA Officials) స్పష్టం చేశారు. పవన్‌ 'వారాహి' వాహనానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కూడా కేటాయించారు. 'వారాహి' రిజిస్ట్రేషన్ నెంబర్ (Varahi Registration Number) TS 13 EX 8384 అని అధికారులు పేర్కొన్నారు. ‘వారాహి’ కలర్‌ ఆలివ్ గ్రీన్‌‌ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు వివరణ ఇచ్చారు. నిబంధనల మేరకు ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనంగా చెబుతున్న ‘వారాహి’ వాహనం రంగు ‘ఆర్మీ’ వాహనాల రంగును పోలి ఉండటంతో ఈ వాహనం గురించి పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.

FjXrDrTUAAEb_M7.jfif

అయితే.. కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం.. చాప్టర్ 121లో ఒక విషయం స్పష్టంగా ఉంది. డిఫెన్స్ శాఖకు చెందిన వాహనాలకు తప్ప అగ్రికల్చర్ ట్రాక్టర్లతో పాటు ఇతర ఏ వాహనాలకూ ఆలివ్ గ్రీన్ కలర్ పెయింటింగ్‌గా వేయకూడదని ఆ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం పవన్ ప్రచార రథమైన ‘వారాహి’కి ఎమరాల్డ్ గ్రీన్ పెయింటింగ్ వేయడంతో ఈ వివాదానికి దాదాపు ఫుల్‌స్టాప్ పడినట్టే కనిపిస్తోంది.

FjXrDrRUAAA4w8N.jfif

‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ జనసేన అధినేత డిసెంబర్ 7న ఒక వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. తన పర్యటనల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనం వారాహి వీడియోను విడుదల చేశారు. ఈ వాహనాన్ని బుధవారం హైదరాబాద్‌లో పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌కు ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోనూ ఆయన చర్చించారు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. ఈ వాహనానికి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించనున్నారు.

వారాహి ప్రత్యేకతలు...

ఇటీవల కాలంలో పవన్‌ సభలు, రోడ్‌ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్న ఉదంతాలు ఎదురవుతుండడంతో వారాహి వాహనంపైనా... చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు.

pawan.jfif

ఇక, వేలమందికి స్పష్టంగా వినిపించేలా అధునాతనమైన సౌండ్‌ సిస్టమ్‌ను వాహనంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే, భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్‌ ప్రత్యేక సర్వర్‌కు రియల్‌ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇక, వాహనం లోపల పవన్‌తో పాటు మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు, వాహనం లోపలి నుంచి పైకి వెళ్లడానికి హైడ్రాలిక్‌ మెట్లు ఉంటాయి.

Updated Date - 2022-12-12T16:37:16+05:30 IST