Supreme Court: జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్యకు నోటీసులు

ABN , First Publish Date - 2022-11-03T20:08:06+05:30 IST

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అక్రమాస్తుల కేసు వ్యవహారంలో మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్య (former IAS BP Acharya)కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది.

Supreme Court: జగన్ అక్రమాస్తుల కేసులో మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్యకు నోటీసులు
Supreme Court

న్యూఢిల్లీ: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అక్రమాస్తుల కేసు వ్యవహారంలో మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్య (former IAS BP Acharya)కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ కార్పొరేషన్‌ ఉద్యోగుల ప్రాసిక్యూషన్‌కు సీఆర్‌పీసీ 197 కింద అనుమతి అవసరమా అనే దానిపై అఫిడవిట్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఈడీ లాయర్ తెలిపారు. 3 వారాల్లోగా అఫిడవిట్ వేయాలని బీపీ ఆచార్యకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా పడింది.

Updated Date - 2022-11-03T20:08:10+05:30 IST