గురుకుల పాఠశాలను సందర్శించిన ఏపీ సెక్రటరీ
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:04 AM
ఆంధ్రప్రదేశ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సంస్థ కార్యదర్శి ప్రసన్న వెంకటేశ బ్రహ్మంగారిమఠం మండలంలోని తోట్లపల్లె గు రుకులాన్ని బుధవారం సందర్శించారు.

బ్రహ్మంగారిమఠం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సంస్థ కార్యదర్శి ప్రసన్న వెంకటేశ బ్రహ్మంగారిమఠం మండలంలోని తోట్లపల్లె గు రుకులాన్ని బుధవారం సందర్శించారు. రూ.20 కోట్ల నిధులతో గురుకుల నిర్మాణం చేపట్టి పను లు పూర్తి కాకపోయినా గత వైసీపీ ప్రభుత్వంలో హడావుడిగా పాఠశాలను ప్రారంభించింది. అయి తే పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడంతో స్థానిక అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రభుత్వానికి సమస్యను అర్జీ ద్వారా విన్నివించారు. దీంతో బుధవారం సంస్థ కార్యదర్శి ప్రసన్న వెంకటేశ గురుకుల పాఠశాలను సందర్శించి మౌలిక వసతులను గుర్తించారు. త్వరలోనే చేయిస్తామని సిబ్బందికి ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. అనంతరం ప్రస్తుతం ఉన్న అంబేడ్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ పిల్లలకు ఉన్నటువంటి మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాలలో విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీవో ఉదయశ్రీ, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.