మార్కెట్ గెజిట్ ప్రకారం రుసుం చెల్లించాల్సిందే
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:01 AM
మున్సిపా లిటీ విడుదల చేసిన కూర గాయల మార్కెట్ గెజిట్ ప్రకారం పాతబస్టాండ్ వద్ద తోపుడు బండ్లు ఇతర దుకాణాలు పెట్టుకున్న వా రంతా రోజుకు 25 రూపాయలు చెల్లించాల్సిందేనని కమిషనర్ మల్లికార్జున స్ప ష్టం చేశారు.

పాత బస్టాండ్ వ్యాపారులకు స్పష్టం చేసిన కమిషనర్
ప్రొద్దుటూరు,ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : మున్సిపా లిటీ విడుదల చేసిన కూర గాయల మార్కెట్ గెజిట్ ప్రకారం పాతబస్టాండ్ వద్ద తోపుడు బండ్లు ఇతర దుకాణాలు పెట్టుకున్న వా రంతా రోజుకు 25 రూపాయలు చెల్లించాల్సిందేనని కమిషనర్ మల్లికార్జున స్ప ష్టం చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వ్యాపా రులతో మాట్లాడుతూ మార్కెట్ గెజిట్ ప్రకారం ఏఏ ప్రాంతాలలో రుసుం చెల్లించాలో స్పష్టంగా పొందుపరిచారన్నారు. మున్సిపాలిటీకి ఆదాయం వస్తే నే కదా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు అన్ని సౌకర్యాలు మెరుగుపరచగల మన్నారు. ఇందుకు వ్యాపారులు మాట్లాడుతూ తామం తా పేదలమని ఎస్సీ, ఎస్టీలమని ప్రతిరోజు మార్కెట్ రుసుం చెల్లించలే మన్నారు. గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే ఏ అధికారి గానీ మానుంచి రుసుం వసూళ్లు చేయలే దని ఇప్పుడు మీరు కొత్తగా అమలు చేస్తే మేమే మున్సిపల్ కార్యాలయం వద్దే బండ్లు పెట్టుకొని ధర్నాలు చేస్తామన్నారు. అయితే పాత బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ స్ధలాలు ఖాళీ చేయాలని మీకంతా ఆరవేటి సినిమా హాలు వెనుక మున్సిపల్ స్ధలం ఉచితంగా ఇస్తామని అక్కడికి వెళ్లి వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. దీంతో మేము ఎక్కడి వెళ్లమని రుసుం చెల్లించమని పాతబస్టాండ్ వద్దనే వ్యాఫారం చేసుకుంటామని చెప్పి వెళ్లిపోయారు.