గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:29 PM
రాయచోటి నియోజకవర్గంలోని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

చిన్నమండెం,మార్చి31(ఆంద్రజ్యోతి): రాయచోటి నియోజకవర్గంలోని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవా రం చిన్నమండెం మండల కేంద్రంలో రూ.15 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డును మం త్రి రిబ్బన కట్ చేసి ప్రారంభించారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసంలో మంత్రి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటి పరిష్కారంపై దృష్టి సారించామన్నారు. అనంతరం సమస్యలపై వినతులు స్వీకరించారు.
సి. పొలిమేరపల్లె జాతరలో మంత్రి
చిన్నమండెం, మార్చి31(ఆంధ్రజ్యోతి): మండలంలోని సి.పొలిమేరపల్లెలో సోమవారం నిర్వహించిన జాతరలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి పలువురు వినతిపత్రాలు సమర్పించారు. అధికారులకు ఫోన చేసి బాధితుల సమస్యలు పరిష్కరించారు.