నాడు-నేడుకు నిధుల కష్టాలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:55 PM
గత వైసీపీ ప్రభుత్వంలో అట్టహాసంగా చేపట్టిన నాడు-నేడు పనులు నిధుల్లేక అర్ధాంతరంగా ఆగిపోయి దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి.

అర్ధాంతరంగా ఆగిన భవన నిర్మాణాలు కొన్ని చోట్ల కనీస వసతులకు నోచుకోని వైనం
ఎర్రగుంట్ల, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో అట్టహాసంగా చేపట్టిన నాడు-నేడు పనులు నిధుల్లేక అర్ధాంతరంగా ఆగిపోయి దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ఎర్రగుంట్ల నగర పంచాయతీతో పాటు, మండలంలో అనేక పాఠ శాలలకు నాడు-నేడు కింద పేజ్1, ఫేజ్2లో నిధులు మంజూరు చేశారు. కాగా ఎర్రగుంట్ల బాలుర ఉన్నత పాఠశాలలో 11 గదులతో కూడి న భవనం మంజూరై పది గదులు నిర్మించారు. ఇందుకు సంబందించి రూ1.29 కోట్లు. నిధులు మంజూరు చేశారు. అయితే గదులు పూర్తయి ఇప్పటికే రెండేళ్లు అవుతున్నా సుమారు రూ.38 లక్షల బిల్లులు రావాల్సివుంది. ఒక భవన నిర్మా ణం ఆగిపోయింది. అలాగే పెయింటింగ్, కిటికీ లు, ఫ్యాన్స, లైట్లు, స్టెప్స్‌కు గ్రిల్, రైలింగ్, డోర్లు, పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ భవనాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు.
మాజీ సీఎస్ చదివినప్పటికి: ప్రభుత్వ మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి ఇదే పాఠశాలలో చదువుకు న్నారు. ఈ భవనం నిర్మాణం సమయంలో ఆయన సీఎస్‌గానే ఉన్నారు. గతంలో నిధులు రాక బిల్డింగ్ ఆగినప్పుడు కలెక్టర్ దృష్టికి వెళ్లగా ఆయన స్పందించి వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు నిధులు రాక పోవడంతో 10గదులు దిష్టిబొమ్మల్లా దర్శనమి స్తున్నాయి. నిధులు రాకపోవడం వల్ల సుమారు రూ.కోటి వెచ్చించి నిర్మించిన భవనం నిరుప యోగంగా ఉంది. దీంతో గదుల్లేక విద్యార్థులు చెట్లకింద చదువుకుంటున్నారు. ఈ గదులు వినియోగలోకి వస్తే ఎంతో ఉపయోగం ఉం టుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు నూతన భవనంలోకి వెళితే..ఇక్కడ స్టాఫ్‌రూం, ల్యాబ్ తదితరం వినియోగంలోకి తెచ్చుకోవచ్చంటున్నారు.
ఫఅలాగే చిలమకూరులోను ఇదే పరిస్థితి.. మండలంలో మరో మేజర్ పాఠశాల అయిన చిలమకూరులో కూడా నిధులు రాక గదులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇక్కడ 10ప్లస్ కూడా మంజూరు అయ్యింది. అయితే గదుల్లేక ఇక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. రూ.84 లక్షలు మొదట్లో మంజూరు అ య్యియి. అయితే రూ.36లక్షలు మాత్రమే విడు దల చేయగా నాలుగు రూములు కట్టారు. నిధులు సరిపోకపోవడంతో అవికూడా అర్ధాంత రంగా ఆగిపోయాయి. పోట్లదుర్తిలో ఒక భవ నం మంజూరైంది. కిటికిలు వాకిళ్లు తదితర వాటికి నిధులు విడుదల కావాల్సివుంది.
భవనాలు లేక ఇబ్బందిగానే ఉంది
పాఠశాలలో విద్యార్థులకు తగిన భవనాల్లేక ఇబ్బందిగా ఉంది. పాఠశాలలో నూతనంగా నిర్మించిన గదులకు త్వరలో నిధులు మంజూరు చేస్తామని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. భవనాలు వస్తే సమస్య ఉండదు.
-రామాంజనేయరెడ్డి,హెచఎం, జడ్పీహైస్కూల్, ఎర్రగుంట్ల
నిధులు రాగానే పూర్తిచేస్తాం
మండలంలో మేజర్‌గా చిలమకూరు జడ్పీ హైస్కూల్‌కు నిధులు మంజూరు కావాల్సి ఉం ది. త్వరలో నిధులు మంజూరు అవుతాయి. నిధులు రాగానే పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తాం.
- రామాంజనేయరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ ఇంజినీర్