మినీ మార్కెట్‌యార్డు అంతేనా..?
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:02 AM
మినీ మార్కెడ్‌యార్డు భవనం పూర్తికాదు.. రైతుల కష్టాలు తీరవు.

పోరుమామిళ్ల, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మినీ మార్కెడ్‌యార్డు భవనం పూర్తికాదు.. రైతుల కష్టాలు తీరవు. పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బికోడూరు మండలాల రైతాంగానికి వారు పండించిన పంటలకు ధరలు వచ్చేంతవరకు నిల్వ ఉంచుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పుల్లీడు సమీపంలో మినీ మార్కెట్‌యార్డుగోడౌనకు స్థలం కేటాయించి నిధు లు మంజూరు చేసింది. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ప్రభుత్వం మారడంతో వైసీపీ హయాంలో దాదాపు రూ.3కోట్లు టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టినా మూ డేళ్లవుతున్నా పూర్తికాక కంపచెట్లు నడుమ నిరుపయోగంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. గత పాలకులు సకాలంలో బిల్లులు చేయకపోవడం వల్లే సమస్య వచ్చిందని రైతులు వాపోతున్నారు. పోరుమామిళ్ల మండలంలోని పుల్లీడు సమీపంలో ఐదు ఎకరాల స్థలంలో మినీ మార్కెట్ యార్డు గోడౌనల నిర్మాణం ఒక్కోటి రూ.కోటి40లక్షలతో శ్రీకారంచుట్టారు. ఈ గోడౌన పూర్తయి తే ఒక్కో గోడౌనలో రెండువేల టన్నులు రైతులు పండించిన ధాన్యం కానీ పంటలు కానీ నిల్వ ఉంచుకునేందుకు వీలు ఉంటుంది. అంతేకాక వీటి నిర్వహణకు ఆఫీసు రూం, చుట్టూ ప్రహరీ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించారు. కానీ అది దాదాపు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా రెండు గోడౌన్లకు సంబంధించి కాంక్రీటు వేసి గోడౌన్లపై రేకులు ఏర్పా టు చేసి పరికరాలు అమర్చాల్సి ఉంది. కానీ బిల్లులు రాకపోవడం, ప్రభు త్వాలు మారడంతో పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనేలా ఉంది.. ఈ మార్కెట్ గోడౌను పూర్తయితే పోరుమామిళ్ల ప్రాంత రైతులు 35 కిలోమీటర్లు బద్వేలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు. అంతేకాక ఈ ప్రాంతంలో ఎక్కువగా క్రాసింగ్‌పంటలు కూడా సాగు చేస్తారు. వరికి పసుపు, పండుమిర్చికి మద్దతు ధర లభించేంత వరకు నిల్వ ఉంచుకు నేందుకు అవకాశం ఉండేది. కానీ ఈ గోడౌన్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోవడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి మినీ మార్కెట్‌యార్డును పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.
రూ.50 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది
మినీ మార్కెట్‌యార్డు గోడౌన నిర్మాణానికి అప్పులు తెచ్చి పనులు చేపట్టాం. పది నెలల క్రితం చేసిన పనులకు మార్చి 31న రూ.12లక్షలు నిధులు మంజూరు చేశారు. ఇంకా రూ.50 లక్షల వరకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. నిర్మాణానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి అధికారులు స్పందించి చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి.
- ధనిశెట్టి ఓబయ్య, కాంట్రాక్టర్, పోరుమామిళ్ల
పనులు చేపడితే బిల్లులు మంజూరు చేస్తాం
మార్కెట్‌యార్డు నిర్మాణ పనులు చేపడితే నిధులు మంజూరవుతాయని ఏఈ మేఘనాధ్ తెలిపారు. ఈ విషయమై ఏఈని వివరణ కోరగా మినీ మార్కెట్‌యార్డు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ముగ్గురు కాం ట్రాక్టర్లు పనులు చేపట్టారు. ఇప్పుడు పనులు చేపడితే బిల్లులు త్వరగా వస్తాయన్నారు.