Nandyala District: డోన్ రైల్వే స్టేషన్లో ప్రమాదం
ABN , First Publish Date - 2022-12-22T12:42:15+05:30 IST
డోన్ రైల్వే స్టేషన్ (Dhone Railway Station)లో ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి గుంతకల్‌కు వెళ్లే డెమో రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు ఓ వృద్ధుడు జారి పడిపోయాడు.
నంద్యాల జిల్లా: డోన్ రైల్వే స్టేషన్ (Dhone Railway Station)లో ప్రమాదం జరిగింది. కర్నూలు (Kurnool) నుంచి గుంతకల్ (Guntakal)కు వెళ్లే డెమో రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు ఓ వృద్ధుడు జారి పడిపోయాడు. రైలు (Rail) కదలడంతో రైలుకు, ట్రాక్‌కు మధ్యలో ఇరుక్కుపోయాడు. 20 అడుగుల మేర రైలు వృద్ధుడిని లాక్కెళ్లింది. రైల్వే అధికారులు, పోలీసులు సకాలంలో స్పందించి వృద్ధిడిని బయటకు తీశారు. స్వల్పంగా గాయపడడంతో అక్కడే ఉన్న వైద్యులు చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో రైల్వే సిబ్బంది, ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. వృద్ధుడు ప్రాణాలతో బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.