పాలకొండ రెవెన్యూ డివిజన్ మ్యాప్ విడుదల
ABN , First Publish Date - 2022-04-07T05:39:14+05:30 IST
జిల్లా విభజన నేపథ్యంలో పాలకొండ రెవెన్యూ డివిజన్ మ్యాప్‌ను సర్కార్ విడుదల చేసింది. ఈమేరకు బుధవారం దానిని సర్వే డిపార్ట్‌మెంట్‌కు అందించింది.
పాలకొండ: జిల్లా విభజన నేపథ్యంలో పాలకొండ రెవెన్యూ డివిజన్ మ్యాప్‌ను సర్కార్ విడుదల చేసింది. ఈమేరకు బుధవారం దానిని సర్వే డిపార్ట్‌మెంట్‌కు అందించింది. తూర్పున శ్రీకాకుళం జిల్లా, పడమరన పార్వతీపురం డివిజన్, ఉత్తరాన ఒడిశా రాష్ట్రం, దక్షిణాన విజయనగరం జిల్లా ఉన్నట్టు ఈ మ్యాప్‌లో ధ్రువీకరించారు. ఏడు మండలాలతో కూడిన పాలకొండ రెవెన్యూ డివిజన్ మన్యం జిల్లాలోనే ఒక భాగంగా ఉంది. అయితే కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు పాలకొండ రెవెన్యూ డివిజన్ దూరంగానే ఉంది. సుమారు 50 కిలోమీటర్ల వరకూ దూరం ఉన్నట్టు ఆ మండలాల ప్రజలు చెబుతున్నారు. తమకు పార్వతీపురం డివిజన్ అయితే సౌకర్యంగా ఉండేదని వారు వెల్లడిస్తున్నారు.