స్పందనకు హాజరుకాని అధికారులు
ABN , First Publish Date - 2022-05-17T05:27:06+05:30 IST
ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ఆకివీడులో నామమాత్రంగా జరుగుతుంది.

ఆకివీడు, మే 16: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ఆకివీడులో నామమాత్రంగా జరుగుతుంది. అధికారులు స్వల్ప సంఖ్యలో హాజరవుతున్నారు. కొన్నిసార్లు స్పందన ఫిర్యాదులు సంబంధిత శాఖాధికారులకు పంపించామని. ఆర్జీలు రాలేదని చూపుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకు ఏడు ఆర్జీలు వచ్చాయని తహసీల్దార్ గురుమూర్తిరెడ్డి తెలిపారు.