ఇక ఎల్‌టీఐ మైండ్‌ట్రీ
ABN , First Publish Date - 2022-11-15T02:03:58+05:30 IST
ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఎల్ అండ్ టీ గ్రూప్ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. మైండ్‌ట్రీ-ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ) విలీనం పూర్తయిందని...

ఎల్ అండ్ టీ ఇన్ఫో-మైండ్‌ట్రీ విలీనం పూర్తి
ఆరో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరణ
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఎల్ అండ్ టీ గ్రూప్ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. మైండ్‌ట్రీ-ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ) విలీనం పూర్తయిందని.. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా కొత్త కంపెనీని ఎల్‌టీఐ మైండ్‌ట్రీగా పిలవనున్నట్లు ఎల్ అండ్ టీ వెల్లడించింది. విలీనం తర్వాత ఆదాయపరంగా చూస్తే ఎల్‌టీఐ మైండ్‌ట్రీ 525 కోట్ల డాలర్ల (సుమారు రూ.43,500 కోట్లు) ఆదాయంతో దేశంలో ఆరో అతిపెద్ద ఐటీ కంపెనీ అవుతుంది. ఈ నెల 24 నుంచి ఎల్‌టీఐ మైండ్‌ట్రీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడవుతాయి. మార్కెట్ క్యాప్‌పరంగా చూస్తే ఎల్‌టీఐ మైండ్‌ట్రీ రూ.1.53 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దేశంలో ఐదో అతి పెద్ద ఐటీ కంపెనీ అవుతుందని ఎల్ అండ్ టీ గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్ చెప్పారు. విదేశాల్లో పని చేస్తున్న 30,000 మంది ఉద్యోగులను కూడా కలుపుకుంటే ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ఉద్యోగుల సంఖ్య 1.2 లక్షలకు చేరనుంది. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ముంబై కేంద్రంగా స్వతంత్రంగా పని చేస్తుందని నాయక్ తెలిపారు. విలీనం తర్వాత ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ఈక్విటీలో ఎల్ అండ్ టీ గ్రూప్‌నకు 68.73ు వాటా ఉంటుంది.