Christmas Celebrations: షార్జాలో తెలుగు ప్రవాసీయుల క్రిస్మస్ వేడుకలు

ABN , First Publish Date - 2022-12-25T19:55:55+05:30 IST

షార్జా ఏమిరేట్‌లో నివాసముంటున్న తెలుగు క్రైస్తవ ప్రవాసీయులు తమ ఏమిరేట్ లోనే క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు.

Christmas Celebrations: షార్జాలో తెలుగు ప్రవాసీయుల క్రిస్మస్ వేడుకలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రభువును ఆరాధించడానికి ఆర్భాటం అవసరం లేదు. ఎడారి అయినా గోదావరి తీరాన లంక గ్రామమైనా ఎక్కడైనా నిండు మనస్సుతో ఆయన నామాన్ని స్మరించుకుంటూ భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే చాలు. అదే విధంగా సంతోషంగా పండుగ జరుపుకోవడానికి ఫలానా అంటూ ఒక ప్రదేశం అవసరం లేదు. అది పాలకొల్లు కావచ్చు లేదా షార్జా కావచ్చు.

షార్జా ఏమిరేట్‌లో నివాసముంటున్న తెలుగు క్రైస్తవ ప్రవాసీయులు(Telugu NRIs) తమ ఏమిరేట్ లోనే క్రిస్మస్(Christmas) పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. యార్మోక్ ప్రాంతంలో ఉన్న షార్జా వర్షిప్ సెంటర్ మరియు సెంట్ మార్టిన్ చర్చిలలో తెలుగు ప్రవాసీయులు క్రిస్మస్ ఉత్సవాలను శని, ఆదివారాలలో ఘనంగా జరుపుకోన్నారు. షార్జాలోని తెలుగు చర్చి అయిన రూపాంతర క్రైస్తవ సంఘం అధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ ఉత్సవానికి అర్చబిషప్ డాక్టర్ రాజబాబు విశాఖపట్టణం నుండి ప్రత్యేకంగా వచ్చి ముఖ్యఅతిథిగా పాల్గొని వాక్యాన్ని వినిపించారు. ప్రొగ్రెసివ్ ఇంగ్లీష్ స్కూల్ డైరెక్టర్ సమా, యస్. ఎ. సమ్యూల్‌లు విశిష్ఠ అతిథులుగా పాల్గొన్నారు. ఎలిం చర్చి (పాస్టర్ దినేష్), తెలుగు క్రైస్తవ సహవాసం (పాస్టర్ ఫ్రాన్సిస్), గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ (సిస్టర్ షారోన్), గోస్పెల్ గ్రేస్ మినిస్ట్రీస్ (పాస్టర్ రమణ బాబు) జీసస్ లవ్స్ మినిస్ట్రీస్ (పాస్టర్ జేమ్స్), రక్షణ సువార్త సంఘం ( పాస్టర్ జోషి కాటిక) మరియు ఇతర పాస్టర్లు క్రీస్తు కుమారు, సుబ్బారావు, జేమ్స్‌లు పాల్గొన్నారు. వైద్య చికిత్స అనంతరం కొన్నాళ్ళు ఆంధ్రాలో ఉండి వచ్చిన సీనియర్ పాస్టర్ భాగ్యానందం గుడాలను అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర ఆధ్యాత్మిక సేవలు జరిగినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఐదవ తరగతి విద్యార్థిని, పాలకొల్లుకు చెందిన ప్రవాసీయులు ప్రభాకర్ రావు – అరుణల కూతురు డెలీనా పాటల పోటీలో ప్రథమ బహుమతి అందుకొంది.

2.jpg

Updated Date - 2022-12-25T20:13:55+05:30 IST