viral video:నాన్నే సూరప్ హీరో.. ఒక్కసారి ఈ వీడియోపై లుక్కేయండి

ABN , First Publish Date - 2022-12-05T10:57:06+05:30 IST

ప్రతి ఇంటికి నాన్నే సూపర్ హీరో. ఇవన్నీ మాటల్లో తరచుగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే నాన్న సూపర్ హీరో అనే విషయం ఇప్పుడు ఉదాహరణతో

viral video:నాన్నే సూరప్ హీరో.. ఒక్కసారి ఈ వీడియోపై లుక్కేయండి

తాను కష్టపడుతూ కుటుంబాన్ని ఎదిగేలా చేసేవాడు నాన్న. అమ్మకష్టం ఇంట్లో ఉండే పిల్లలకు అర్థమవుతుంది. కానీ నాన్న కష్టం ఓ వయసుకు వస్తే తప్ప అర్థం కాదు. సహా స్పష్టమవుతోంది. అసలు విషయంలోకి వెళితే..

ఓ తండ్రి తన కొడుకును స్కూల్ నుండి ఇంటికి తీసుకెళ్ళడానికి బైక్‌లో పికప్ చేసుకున్నాడు. తన వెనుక కూర్చోబెట్టుకుని వెళుతుండగా పిల్లాడు దారిలో బైక్‌పై కూర్చునే నిద్రపోయాడు. దారి మద్యలో పిల్లాడు నిద్రపోయిన విషయాన్ని గమనించిన ఆ తండ్రి సూపర్ మ్యాన్ లాగా ఒక చేత్తో పిల్లాడిని పట్టుకుని పట్టుకుని, మరొక చేత్తో బైక్‌ను హ్యండిల్ చేశాడు. ఈ దృశ్యాలను వెనక వస్తున్న ప్రయాణికులు గమనించి.. వీడియో తీశారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా ‘నాన్నను సూపర్ మ్యాన్ అని ఇందుకే అంటారు’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఈ వీడియో చూసి తమ చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చిన్ననాటి అనుభవాలను వీడియో కింద పంచుకున్నారు. ప్రభాస్ సినిమాలో కూతురు పెళ్ళి కోసం ఇల్లు అమ్మేస్తానని చంద్రమోహన్ చెప్పినప్పుడు ‘అదీ నాన్నంటే’ అనే డైలాగ్ ఉంటుంది కదా నెటిజన్లు కూడా ఇప్పుడు అదే అంటున్నారు.

Updated Date - 2022-12-05T10:57:08+05:30 IST