జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో సత్తా చాటిన మెదక్‌ జిల్లా విద్యార్థులు

ABN , First Publish Date - 2022-12-11T23:47:40+05:30 IST

జాతీయస్థాయి కరాటే పోటీల్లో మెదక్‌ పట్టణానికి చెందిన విద్యార్థులు సత్తా చాటి ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్నారు.

జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో సత్తా చాటిన మెదక్‌ జిల్లా విద్యార్థులు
ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన విద్యార్థులు

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 11: జాతీయస్థాయి కరాటే పోటీల్లో మెదక్‌ పట్టణానికి చెందిన విద్యార్థులు సత్తా చాటి ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్నారు. ఆదివారం మేడ్చల్‌లోని సుమంగళి కన్వేషన్‌లోహాల్‌లో కియో జపాన్‌ షోటోకాన్‌ అసోసియేషన్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ కరాటేలో 60 కేజీ స్పారింగ్‌లో విజయప్రసాద్‌, 30 కేజీలలో శ్రీహర్షిణి గోల్డ్‌, 30 కేజీల స్పారింగ్‌లో సాయి కారుణ్య, హరిణి, విద్యాధర్‌, లక్ష్మినరసింహ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.

Updated Date - 2022-12-11T23:47:41+05:30 IST