హరితహారానికి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-30T06:46:44+05:30 IST

జిల్లాలో ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం కోసం సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంకాగానే జిల్లాలోని ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని 530 గ్రామాలలో, మున్సిపాలిటీల పరిధిలో నర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు. లక్ష్యానికి అనుగుణంగా అన్ని శాఖల ఆధ్వర్యంలో మొక్కలు

హరితహారానికి ఏర్పాట్లు
మోపాల్‌ మండలకేంద్రంలో గల నర్సరీలో హరితహారానికి సిద్ధంగా ఉన్న మొక్కలు

జిల్లాలో 8వ విడత హరితహారం కోసం మొక్కలు సిద్ధం

530 గ్రామ పంచాయతీల పరిధిలో గల ఆయా నర్సరీలలో మొక్కల పెంపకం

ఈ సంవత్సరం 45లక్షల 31వేల 238 మొక్కలు నాటాలని లక్ష్యం 

వర్షాలు కురవగానే ప్రణాళికకు అనుగుణంగా నాటనున్న వివిధ రకాల మొక్కలు

జిల్లావ్యాప్తంగా మొత్తం 30 శాఖలతో పాటు ఇతర సంస్థలకు కేటాయింపులు

నిజామాబాద్‌, మే 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం కోసం సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంకాగానే జిల్లాలోని ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని 530 గ్రామాలలో, మున్సిపాలిటీల పరిధిలో నర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు. లక్ష్యానికి అనుగుణంగా అన్ని శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు కేటాయింపులు చేశారు. రహదారులతో పాటు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థల్లో పెద్దఎత్తున మొక్కలు పెట్టుందుకు సిద్ధమవుతున్నారు.

జిల్లాలో 8వ విడత హరితహారం

జిల్లాలో ఈ వానాకాలంలో 8వ విడత హరితహారం కింద మొక్కలు నాటేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సంవత్సరం 45లక్షల 31వేల 238 మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని మొత్తం 30 శాఖలకు లక్ష్యాలను నిర్ధేశించారు. వీటితో పాటు ఇతర సంస్థలకు కూడా కేటాయింపులు చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాల పరిధిలో ఈ హరితహారం కోసం కోటిన్నర మొక్కలు పెంచుతున్నారు. పండ్లను ఇచ్చే మొక్కలతో పాటు కలప, పూలమొక్కలను స్థానిక నర్సరీ ల్లో పెంచుతున్నారు. వీటితో పాటు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు ఉపయోగపడే మొక్కలను నాటేందుకు సిద్ధమవుతున్నారు.

రెండు, నాలుగు వరుసల్లో మొక్కలు

జిల్లాలో ఆర్‌ అండ్‌ బి శాఖ ద్వారా 30 లక్షల మొక్కలు పెట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులతో పాటు మండల, గ్రామాల్లో ఉన్న రహదారుల వెంట రెండు, నాలుగు వరుసల్లో మొక్కలు పెట్టేందుకు నిర్ణయించారు. గత సంవత్సరం పెట్టిన మొక్కలతో పాటు కొత్తగా అవెన్యూప్లానిటేషన్‌ రోడ్ల వెంట చేయాలని నిర్ణయం తీసుకున్నా రు. శాఖకు లక్ష్యాన్ని ఇవ్వడంతో పాటు ముందే ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 6లక్షల 3వేల 594 మొక్కలు, బోధన్‌ 3లక్షలు, ఆర్మూర్‌లో 2లక్షలు, భీంగల్‌ 30వేల మొక్కలు పెట్టాలని నిర్ణయించారు. అటవీశాఖ ద్వారా 2లక్షల మొక్కలను రిజర్వ్‌ ఫారెస్టులో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతం, గుట్టల వెంట ఈ మొక్కల ను పెట్టనున్నారు. అడవిలో ఉండే జంతువులకు ఉపయోగపడే పండ్లను ఇచ్చే మొక్కలు ఎక్కువ నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు కలప ను ఇచ్చే మొక్కలను పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నా రు. జిల్లాలో ఎక్సైజ్‌శాఖ ద్వారా 80వేల మొక్కల ను నాటాలని నిర్ణయించారు. ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని గీత కార్మికులకు ఉపయోగపడే తాటి, ఈత వనాలు నాటేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌శాఖ ద్వారా 14,695 మొక్కలు, వ్యవసాయశాఖ ద్వారా 50 వేల మొక్కలు పెట్టేందుకు నిర్ణయించారు. ఆయా మండలాల పరిధిలోని ఏఈవోల ద్వారా ఈ మొక్కలను రైతు సమన్వయ సమితిలతో కలిపి పెట్టనున్నారు. ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ ద్వారా 25 వేలు, విద్యాశాఖ ద్వారా 5074, మార్కెటింగ్‌శాఖ ద్వారా 2 వేల మొక్కలు, గనులుభూగర్భ శాఖ 3వేలు, పోలీసుశాఖ ద్వారా 3వేలు, మత్య్సశాఖ ద్వారా 2వేల మొక్కలను 8వ విడత హరితహారంలో భాగంగా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిచ్‌పల్లి పోలీస్‌ బెటాలియన్‌లో 2వేలు, రవాణాశాఖ ఆధ్వ ర్యంలో 2వేలు, యువజనులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 1500, ఇంటర్మీడియట్‌ శాఖ ఆధ్వర్యంలో 500, పర్యటకశాఖ ఆధ్వర్యంలో 800, రైల్వేల ద్వారా వెయ్యి, వి ద్యుత్‌శాఖ ద్వారా వెయ్యి, పశుసంవర్దకశాఖ ద్వారా 800, జైల్‌శాఖ ద్వారా 500 మొక్కలను పెట్టేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా 750, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 500, గిరిజన సంక్షేమశాఖద్వారా 400 మొక్కలు పెట్టేందుకు నిర్ణయించారు. బీసీ సంక్షేమం, అగ్నిమాకశాఖ ఆధ్వర్యంలో మొక్క లు పెట్టేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో గత సంవత్సరంలాగానే వర్షా లు మొదలుకాగానే ఈ మొక్కలను పెట్టేందుకు ప్రణాళికను రూపొందించారు. 

‘ఉపాధి’ నిధులతో ఆయా పనులు

జిల్లాలో ఉపాధి హామీ పథకం నిధులను ఈ హరితహారానికి ఉపయోగించి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. గత ఏడు విడతల్లో నిధులు వినియోగించినలాగానే 8వ విడతలో మొక్కలు పెట్టేందుకు గుంతలు తవ్వడంతో పాటు నీళ్ల కోసం మొక్కల రక్షణ కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. ఉపాధి హామీ పథకం నిధులను వెచ్చించి గత ఏడు విడతల్లో పెట్టిన మొక్కలు రక్షించడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా లక్ష్యాన్ని సాదించుకునేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నారు. జిల్లాలో ఏడు విడతల్లో పెట్టిన మొక్కలను పరిశీలించడంతో పాటు ఎక్కడైనా తక్కువగా ఉంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువ శాతం మొక్కలు పెట్టేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. నర్సరీలలో మొక్కలు పెంచడం పర్యవేక్షిస్తూనే గతంలో పెట్టిన మొక్కల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

హరితహారం మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం

: సునీల్‌రామత్‌, జిల్లా అటవీశాఖ అధికారి

జిల్లాలో ఎనిమిదో విడత హరితహారం కోసం పలు రకాల మొక్కలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆయా శాఖలకు లక్ష్యాలు నిర్ణయించడం పూర్తయ్యింది. దీనిలో భాగంగా వానాకాలం ఆరంభం కాగానే మొక్కలు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కాగానే నర్సరీల ద్వారా మొక్కలను సరఫరా చేసి ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమాన్ని అంతటా ప్రారంభిస్తాం.  

Updated Date - 2022-05-30T06:46:44+05:30 IST