AP News: అనంతబాబు కేసు.. సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ

ABN , First Publish Date - 2023-01-04T18:38:10+05:30 IST

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha Babu)పై నమోదు చేసిన కేసును సీబీఐ (CBI)కి అప్పగించేందుకు హైకోర్టు (Highcourt) నిరాకరించింది.

AP News: అనంతబాబు కేసు.. సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ

అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha Babu)పై నమోదు చేసిన కేసును సీబీఐ (CBI)కి అప్పగించేందుకు హైకోర్టు (Highcourt) నిరాకరించింది. సీసీటీవీ ఫుటేజ్‌కు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్‌ను 15 రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారికి ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి అందులోని వ్యక్తులను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే హత్య విషయంలో వారి పాత్రను నిర్దారించి ఆ వివరాలతో అదనపు అభియోగ పత్రాన్ని దాఖలు చేయాలని హైకోర్టు తీర్పు నిచ్చింది. మూడు నెలల్లో తుది చార్జ్‌షీటు దాఖలు చేయాలని దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం తరపున న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.

Updated Date - 2023-01-04T18:38:11+05:30 IST