AP TDP chief: డీజీపీకి ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు లేఖ

ABN , First Publish Date - 2023-06-22T17:54:01+05:30 IST

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి (DGP) ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు (AP TDP chief Kinjarapu Atchannaidu) లేఖ రాశారు.

AP TDP chief: డీజీపీకి ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు లేఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీకి (DGP) ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు (AP TDP chief Kinjarapu Atchannaidu) లేఖ రాశారు. కానూరు ట్రస్ట్ భూములపై వైసీపీ నేతల కన్ను, ఫేక్‌ రిజిస్ట్రేషన్లు, NRI ఫ్యామిలీపై హత్యాయత్నం, కిడ్నాప్‌ ఘటనపై లేఖ రాసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ట్రస్ట్ భూముల కబ్జాకు, హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న NRI ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. NRIపైనే తప్పుడు కేసులు బనాయించడం దారుణమని, రూ.100 కోట్ల విలువైన 6 ఎకరాల కబ్జాకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, నిందితులకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని, NRI ట్రస్ట్ భూముల కబ్జా, కిడ్నాప్ ప్రయత్నంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిజమైన దోషులను డీజీపీ శిక్షించాలని అచ్చెన్నాయుడు కోరారు.

Updated Date - 2023-06-22T17:55:05+05:30 IST