AP News: ఇద్దరం మంత్రులుగా చేశాం.. వైసీపీ మంత్రికి టీడీపీ సీనియర్ నేత సవాల్

ABN , First Publish Date - 2023-04-10T16:50:52+05:30 IST

మంత్రి మేరుగ నాగార్జున (Merugu Nagarjuna)కు టీడీపీ (TDP) సీనియర్ నేత నక్కా ఆనందబాబు (Nakka Anand Babu) సవాల్ విసిరారు.

AP News: ఇద్దరం మంత్రులుగా చేశాం.. వైసీపీ మంత్రికి టీడీపీ సీనియర్ నేత సవాల్

బాపట్ల: మంత్రి మేరుగ నాగార్జున (Merugu Nagarjuna)కు టీడీపీ (TDP) సీనియర్ నేత నక్కా ఆనందబాబు (Nakka Anand Babu) సవాల్ విసిరారు. దళితులు, మైనార్టీల అభివృద్ధిపై చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే మంత్రి మేరుగ నాగార్జున చర్చకు రావాలన్నారు. మంత్రి మేరుగ చేసిన దాడులు, దోపిడీ, మోసాలు నిరూపిస్తానని నక్కా ఆనందబాబు సవాల్ విసిరారు. ఇద్దరం సాంఘిక సంక్షేమశాఖకు మంత్రులుగా చేశామన్నారు. ఎవరెవరు ఏమేం చేశామో చర్చిద్దామా? అని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు.

కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇసుక, మట్టి అడ్డగోలుగా దోచేశాడంటూ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. 'నక్కా ఆనందబాబు బతుకేంటో అందరికీ తెలుసు. నియోజకవర్గంలో జగన్‌ అన్న కాలనీల్లో ఇళ్లకు అన్ని అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. మట్టి తవ్వకాలకు పంచాయతీ తీర్మానాలు, కలెక్టర్ అనుమతులు ఉన్నాయి. నక్కా ఆనందబాబు అక్రమ మట్టి తవ్వకాలు అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నించారు. ఆనందబాబుకు ప్రజలే బుద్ధి చెప్పారు. నియోజకవర్గంలో ఏ ఊరు వెళ్లిన ఇలాంటి పరిస్థితి ఉంటుందని' మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు.

Updated Date - 2023-04-10T16:50:52+05:30 IST

News Hub