పిచ్చికుక్క దాడిలో తల్లీ, కూతుళ్లకు గాయాలు

ABN , First Publish Date - 2023-02-16T00:43:05+05:30 IST

మండలంలోని మిట్టగుడిపాడు గ్రామంలోని దళితవాడలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. మండలంలోని మిట్టగుడిపాడుకు చెందిన కర్రా అవని (5) ఇంటిముందు ఆడుకుంటుండగా పిచ్చికుక్క దాడిచేసింది.

పిచ్చికుక్క  దాడిలో తల్లీ, కూతుళ్లకు గాయాలు
పిచ్చికుక్క దాడిలో గాయపడిన తల్లీ, కూతుళ్లు కోటమ్మ, అవని

పీహెచ్‌సీలో కరువైన హెచ్‌ఆర్‌ఐజీ ఇంజక్షన్లు

జనవరిలో 54, ఫిబ్రవరిలో 28మందికి కుక్కకాటు

రెంటచింతల, ఫిబ్రవరి 15: మండలంలోని మిట్టగుడిపాడు గ్రామంలోని దళితవాడలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. మండలంలోని మిట్టగుడిపాడుకు చెందిన కర్రా అవని (5) ఇంటిముందు ఆడుకుంటుండగా పిచ్చికుక్క దాడిచేసింది. గమనించిన తల్లి కర్రా కోటమ్మ కుక్కను తోలేందుకు యత్నించగా ఆమెపైకూడా కుక్క దాడిచేసి గాయపర్చింది. మాములు కుక్కలు కరిస్తే ఇచ్చే యాంటీ ర్యాబిస్‌ ఇంజక్షన్‌ రెంటచింతలలోని పీహెచ్‌సీలో అందుబాటులో ఉంటుంది. కానీ వీరిని కరిచింది పిచ్చికుక్క కావటంతో వీరికి రెంటచింతల పీహెచ్‌సీలో ఇంజక్షన్‌ లభించలేదు. దీంతో మాచర్ల ప్రభుత్వాసుపత్రికి వెళ్లి హెచ్‌ఆర్‌ఐజీ (హ్యూమన్‌ రేబీస్‌ ఇమ్యూనోగ్లోబిన్‌) ఇంజక్షన్‌ వేయించుకున్నారు. ఈ ఇంజక్షన్లను పీహెచ్‌సీలో కూడా అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు. జనవరి నెలలో కుక్కకాటుకు గురైన వారు 54, ఫిబ్రవరి 15వరకు 28మంది బాధితులు యాంటీర్యాబిస్‌ ఇంజక్షన్లు తీసుకున్నారు. సంబంధిత అధికారులు గ్రామాల్లోను, పట్టణంలోనూ కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2023-02-16T00:43:11+05:30 IST