ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు

ABN , First Publish Date - 2023-04-06T23:09:32+05:30 IST

భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాల యం ముందు బీజేనీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండిఆనంద్‌ బీజేపీ జెండాను ఆవిష్కరించారు.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు
మదనపల్లె: బీజేపీ జెండాను ఆవిష్కరించిన బ ండిఆనంద్‌

మదనపల్లె అర్బన, ఏప్రిల్‌ 6: భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాల యం ముందు బీజేనీ యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండిఆనంద్‌ బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1980 ఏప్రిల్‌ 6న అటల్‌ బిహారీ వాజపేయి మొట్టమొదటి అధ్యక్షుడిగా పార్టీ ఆవిర్భవించిందన్నారు. అద్వానీ, మురళీమనోహర్‌ జోిషి దేశంలోని అన్ని ప్రాంతాలకు, రాష్ట్రాలకు పర్యటించి ఈ రోజు ప్రపంచంలోనే పెద్ద స్థాయి కలిగిన పార్టీగా బీజేపీ నిలిపారన్నారు. అదేవిధంగా నేడు నరేంద్ర మోడీ, అమీషా, జేపీనడ్డా దేశాభివృద్ధికి కృషి చేస్తునట్లు తెలిపారు. కార్యక్ర మంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జర్మనీరాజు, రూరల్‌ మండల అధ్యక్షు డు వసంతకుమార్‌, మేణు, పిల్లస్వామి నాయక్‌, మధుసూదన, కిరణ్‌ కుమార్‌, గిరి, రాజారెడ్డి, బాలకృష్ణ, రాజేంద్ర, తదిరులు పాల్గొన్నారు.

రామసముద్రం: భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామసముద్రంలోని అంబేద్కర్‌ కూడలిలో మండల బీజేపీ అద్యక్షుడు నాగరాజశెట్టి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండల అధ్యక్షులు, నాగరాజశెట్టి, ప్రధాన కార్యదర్శి, శేఖర్‌, రాజేష్‌, బీజేవైఎం, అధ్యక్షులు గంగరాజు, అశోక్‌, కార్యదర్శి బాలాజి, గుంతలపేట చలపతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ములకలచెరువు: మండలంలోని వేపూరికోటలో బీజేపీ రాష్ట్ర కో ఆపరేటివ్‌ కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయరారెడ్డి, ఆసెంబ్లీ కన్వీనర్‌ మంగరాజు, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫరీద్‌ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శోభా రాణి, కిసాన మోర్చా అధ్యక్షుడు సుధాకర్‌, మండల ప్రధాన కార్యదర్శి బయారెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మునీంద్ర, నాయకులు శంకర్‌రెడ్డి, మద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-06T23:09:32+05:30 IST