Budda venkanna: కొడాలి నానికి ఆయన స్టైల్లోనే కౌంటర్ ఇచ్చిన బుద్దావెంకన్న

ABN , First Publish Date - 2023-02-16T10:41:38+05:30 IST

చంద్రబాబు, లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్టైల్లోనే టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

Budda venkanna: కొడాలి నానికి ఆయన స్టైల్లోనే కౌంటర్ ఇచ్చిన బుద్దావెంకన్న

అమరావతి: చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), లోకేష్‌ (Nara Lokesh)పై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) చేసిన వ్యాఖ్యలపై ఆయన స్టైల్లోనే టీడీపీ నేత బుద్దా వెంకన్న (Budda Venkanna) కౌంటర్ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని (YCP MLA)ని ఊరకుక్క అంటూ మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) ప్రారంభంకావడంతో పిచ్చి కుక్కలను జగన్ (YS Jaganmohan Reddy) రోడ్ల మీదకు వదిలారని... కొడాలి నాని, ఇతర కుక్కలు చంద్రబాబు, లోకేష్‌పై నోరు పారేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. గుడివాడ (Gudivada)లో జేబులు కొట్టేసే నాని.. చంద్రబాబు (TDP Chief)ను తిట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాళ్లంతా దగ నాకొడకులు కాబట్టే... అందరినీ అలాగే అనుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ‘‘చంద్రబాబు నాన్న పేరు నీకెందుకు... నీ నాన్న పేరు ఏంటో చెప్పు... ఒక్కసారి అయినా చెప్పావా. ఎన్టీఆర్‌కు నువ్వు వారసుడివి ఏంటి. లోకేష్ వారసుడు కాదా... నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదు.. నువ్వు ఎలా వారసుడివి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా జగన్మోహన్ రెడ్డిని అనగలమని, మహా అయితే అరెస్టు చేస్తారు లేదా చంపేస్తారని ఆయన అన్నారు.

‘‘నువ్వు అసలు‌ వైసీపీ (YCP)లోకి ఎప్పుడు వెళ్లావు. కోటంరెడ్డి (KotamReddy SridharReddy) ఎప్పటి నుంచో ఉన్నాడు... ఆయన బాధ కలిగి మాట్లాడాడు. నీకు కోటంరెడ్డిని అనే అర్హత కూడా లేదు. గుడివాడలో హరికృష్ణకు ఎన్నికల ఏజెంట్‌వి నీవు. నాలుగో స్థానంలో ఉన్నాడంటే నువ్వు వెన్నుపోటు పొడిచినట్లేగా. నువ్వు మళ్లీ ఇరవై వేల ఓట్లతో గెలుస్తావా... ఈసారి ప్రజలు నిన్ను తరిమి కొడతారు. వివేకానంద (YS Vivekananda) హత్య కేసుపై టీడీపీ (TDP) అనుమానాలు వ్యక్తం చేసింది. కానీ ఈ కొడాలి నాని.. వైఎస్‌ కుటుంబం (YS Family)లో చిచ్చు పెట్టాడు. నా తమ్ముడు నాకన్నా గొప్ప అని గతంలో వైయస్ చెప్పారు. జగన్‌కు ఏంటి లాభం అన్నాడంటే... వివేకానంద రెడ్డి హత్య కేసు (Vivekananda Reddy Murder Case) గురించి నానికి కూడా తెలుసు. చంద్రబాబు బిక్షతో ఎమ్మెల్యే అయి.. ఆయన్నే తిడతావా. నాకు జ్ఞానం ఉంది... నీకు ఏం తెలుసని వాగుతావు. కమ్మవారి కోటాలో‌ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వాలి. కమ్మ కోటాలో ఎమ్మెల్యే, మంత్రి కావాలి. కానీ తిట్టేది మాత్రం కమ్మ కులాన్నే. గుడివాడ ప్రజలు రాళ్లతో కొట్టి చంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జైలు వెళ్లి జగన్‌ (AP CM)ను కలిసి డీల్ మాట్లాడుకుంటే టీడీపీ నిన్ను సస్పెండ్ చేసింది. వైసీపీ కోసం మొదటి నుంచి పని చేస్తున్న వారు ఈ ఊర కుక్కతో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

2024 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ (YCP Party) అడ్రస్ గల్లంతవడం ఖాయమని స్పష్టం చేశారు. కోటంరెడ్డిని ‌చూసి బుద్ది తెచ్చుకోవాలని... ఆయన జగన్‌ని తిడుతున్నారా అంటూ ప్రశ్నించారు. పోలీసులు (AP Police) కూడా దొంగ కేసులు పెట్టడం లేదన్నారు. జగన్‌ను నమ్ముకుంటే తాము కూడా మునుగుతాం అని పోలీసులకు అర్థం అయ్యిందన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కొడాలి నానిని తీసుకెళ్లి సీబీఐ (CBI) నాలుగు తగిలించాలని.. అప్పుడుఅవినాష్ రెడ్డి, జగన్ రెడ్డిలను వెనుకేసుకొస్తున్న కథ మొత్తం చెబుతాడన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే నాని అనే ఊర కుక్కకి తగిన బుద్ది చెబుతామని బుద్దా వెంకన్న(TDP Leader) హెచ్చరించారు.

Updated Date - 2023-02-16T10:41:39+05:30 IST