TDP: పిచ్చోడి పాలనను హేళను చేస్తూ.. పక్క రాష్ట్రాలు ఎన్నికల ప్రచారం: బోండా ఉమా | TDP Leaders fire on CM Jagan anr
Share News

TDP: పిచ్చోడి పాలనను హేళను చేస్తూ.. పక్క రాష్ట్రాలు ఎన్నికల ప్రచారం: బోండా ఉమా

ABN , First Publish Date - 2023-11-03T13:29:59+05:30 IST

అమరావతి: సీఎం జగన్‌కు ముదిరిన పిచ్చిపై రాష్ట్ర గవర్నర్ దృష్టి సారించాలని, పిచ్చోడి పరిపాలనను హేళను చేస్తూ పక్క రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు.

TDP: పిచ్చోడి పాలనను హేళను చేస్తూ.. పక్క రాష్ట్రాలు ఎన్నికల ప్రచారం: బోండా ఉమా

అమరావతి: సీఎం జగన్‌ (CM Jagan)కు ముదిరిన పిచ్చిపై రాష్ట్ర గవర్నర్ (Governor) దృష్టి సారించాలని, పిచ్చోడి పరిపాలనను హేళను చేస్తూ పక్క రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు (Bonda Uma Maheswararao) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ గతంలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల భద్రత లేకుండా, అభివృద్ధిలేని రాష్ట్రంగా బీహార్‌ (Bihar)ను ఉదాహరణగా చూపించిన దేశం.. ఇప్పుడు ఏపీ (AP)ని చూపిస్తోందన్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేతో (Prashant Kishore Survey) పాటు ఇంటెలిజెన్స్ సర్వేలు, ఇతర సర్వేలు వైఎస్సార్‌సీపీ (YSRCP)కి సింగిల్ డిజిట్ కూడా రావని తేల్చేయటంతో చేసేది లేక చంద్రబాబు (Chandrababu)పై కేసుల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తాను చేసిన అవినీతిపై భవిష్యత్తులో కేసులు తప్పవని భావించిన జగన్, అవే అంశాల్లో చంద్రబాబుపై తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు రుద్ది రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని బోండా ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu) మాట్లాడుతూ.. తండ్రి వైఎస్‌ (YS)కు అధికారం ఉన్నప్పుడే రాష్ట్రాన్ని అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి దోచేశాడనటానికి సీబీఐ ఆధారాలతో సహా ఛార్జ్ షీట్‌లు దాఖలు చేసిందన్నారు. తెలుగుదేశం నేతలపై ఛార్జ్ షీట్‌లు లేకుండా తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్‌కు పంపి కక్షసాధించుకుంటున్నారు తప్ప ఎలాంటి అవినీతి లేదన్నది సుస్పష్టమన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం పోవటం, శాశ్వతంగా జైలుకు పోవటం ఎలాగూ ఖాయమని ఆయన అన్నారు. మచ్చలేని నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ఏదోరకంగా మసిపోయాలనే రోజుకో అక్రమ కేసు పెడుతున్నారని మండిపడ్డారు. ఇసుక, మద్యం కుంభకోణాలపై తెలుగుదేశం పోరాడుతున్నందుకే ఎదురు అక్రమ కేసులు పెట్టారని ఆనంద్ బాబు అన్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) మాట్లాడుతూ.. పిచ్చి కుక్కలు సమాజానికి ఎంత ప్రమాదమో..., పిచ్చి ముదిరిన ప్రభుత్వమూ ప్రజలకు అంతే చేటని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కక్ష సాధింపు కుట్రలో పాలన గాడితప్పి, వ్యవస్థలు గతి తప్పాయని వర్ల రామయ్య అన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-11-03T13:30:02+05:30 IST