AP Assembly: సందర్భం లేకుండానే చంద్రబాబు అరెస్ట్‌ను ప్రస్తావించిన అంబటి.. ఇంతకీ ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2023-09-25T12:45:14+05:30 IST

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిశాయి. అయితే మంత్రి అంబటి రాంబాబు మాత్రం సందర్భం లేకుండానే టీడీపీ సభ్యుల బాయ్ కాట్, చంద్రబాబు అరెస్టును సభలో ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అవకాశం ఈరోజు కలిగిందని అన్నారు.

AP Assembly: సందర్భం లేకుండానే చంద్రబాబు అరెస్ట్‌ను ప్రస్తావించిన అంబటి.. ఇంతకీ ఏమన్నారంటే?

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిశాయి. ఈక్రమంలో మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) సందర్భం లేకుండానే టీడీపీ సభ్యుల బాయ్ కాట్, చంద్రబాబు అరెస్టును (Chandrababu Arrest) సభలో ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అవకాశం ఈరోజు కలిగిందని అన్నారు. దీనికి కారణం టీడీపీ సభ్యులు బాయ్ కాట్ చేసి వెళ్లి పోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. ‘‘మొట్టమొదటి రోజు వచ్చారు, రెండోరోజు వచ్చారు మీసాలు మెలివేశారు, తోడలు కొట్టారు... చర్చకు రమ్మని అంటూ ఊదుడు ఈలలు ఊదుకుంటూ వెళ్లిపోయారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు వాస్తవాలు బయట పడుతున్నాయని తెలిపారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అని అనుకుంటున్నవారు కూడా వాస్తవాలు గ్రహిస్తున్నారన్నారు. ఒకాయిన ఢిల్లీలో ఉన్నారని, మద్దతు ఇచ్చిన ఆయన ఎక్కడి ఉన్నాడో తెలియదని యెద్దేవా చేశారు. స్కాముల రూపంలో ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును రాబట్టుకునే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా అవినీతికి పాల్పడ్డారని.. అందులో సందేహం లేదన్నారు. ఇది రాజకీయ కక్ష కాదు అంటూ ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు అసెంబ్లీ సాక్షిగా మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. అనంతరం టీ బ్రేక్ కోసం ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది.

Updated Date - 2023-09-25T12:45:14+05:30 IST