విషాదం.. ట్రాక్టర్ని స్టార్ట్ చేసి బాలుడు మృతి

ABN , First Publish Date - 2023-06-07T21:06:36+05:30 IST

జిల్లాలోని కురిచేడు మండలం పెద్దవరంలో విషాదఘటన చోటుచేసుకుంది.

విషాదం.. ట్రాక్టర్ని స్టార్ట్ చేసి బాలుడు మృతి

ప్రకాశం: జిల్లాలోని కురిచేడు మండలం పెద్దవరంలో విషాదఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ ట్రాక్టర్ని ఎనిమిదేళ్ల బాలుడు స్టార్ట్ చేశాడు. దాంతో ట్రాక్టర్ ముందుకు కదలడంతో అక్కడే ఉన్న వైరు మెడకు చుట్టుకుని బాలుడు మృతి చెందాడు. బాలుడి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2023-06-07T21:06:36+05:30 IST