Srikakulam: ఆటో నుంచి గాల్లోకి రూ.500 నోట్లు..ఆటోను వెంబడించిన టోల్ సిబ్బంది.
ABN , First Publish Date - 2023-03-05T09:21:57+05:30 IST
జిల్లాలోని మడపాం టోల్‌ప్లాజా(Toll Plaza) దగ్గర నోట్ల కట్టల కలకలం రేపాయి. టోల్‌ప్లాజా దగ్గర ఆటో నుంచి గాల్లోకి
శ్రీకాకుళం: జిల్లాలోని మడపాం టోల్‌ప్లాజా(Toll Plaza) దగ్గర నోట్ల కట్టల కలకలం రేపాయి. టోల్‌ప్లాజా దగ్గర ఆటో నుంచి గాల్లోకి రూ.500 నోట్లు(notes) ఎగిరాయి. గాల్లోకి ఎగిరిన రూ.500 నోట్లను చూసిన టోల్‌ప్లాజా సిబ్బంది ఆటోను వెంబడించారు. ఎంత ప్రయత్నించినా చివరకు ఆటో మాత్రం దొరకలేదు. దీంతో నోట్ల కట్టలపై టోల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపారు. రూ.88వేలు టోల్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.