AP News: శ్రీకాకుళంలో దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2023-01-19T09:10:00+05:30 IST

జిల్లాలోని మెలియాపుట్టి మండలం డేగలపోలూరులో దొంగలు బీభత్సం సృష్టించారు.

AP News: శ్రీకాకుళంలో దొంగల బీభత్సం

శ్రీకాకుళం: జిల్లాలోని మెలియాపుట్టి మండలం డేగలపోలూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. కత్తులు, తుపాకీ చూపించి బంగారం, డబ్బును దుండగులు ఎత్తుకెళ్లారు. సేనాపతి దుర్యోధనరావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. అడ్డుకున్న దుర్యోధనరావుపై దాడి చేశారు. కుటుంబ సభ్యుల నోట్లో వస్త్రాలు కుక్కి బంధించి మరీ దొంగలు దోపిడీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-01-19T09:10:03+05:30 IST