AP NEWS: విశాఖ, రాయపూర్‌ మహదేవ్‌ ఆన్‌లైన్ యాప్ కార్యాలయాలపై ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2023-08-24T13:06:12+05:30 IST

విశాఖ, రాయపూర్‌లోని మహదేవ్‌ యాప్‌ కార్యాలయంలో(Mahadev App Office)లో ఈడీ సోదాలు(ED Raids) చేపట్టింది. హవాలా రూపంలో భారీగా డబ్బు తరలించినట్లు అధికారులు గుర్తించారు.

AP NEWS: విశాఖ, రాయపూర్‌ మహదేవ్‌ ఆన్‌లైన్ యాప్ కార్యాలయాలపై ఈడీ సోదాలు

విశాఖ: విశాఖ, రాయపూర్‌లోని మహదేవ్‌ యాప్‌ కార్యాలయంలో(Mahadev App Office)లో ఈడీ సోదాలు(ED Raids) చేపట్టింది. హవాలా రూపంలో భారీగా డబ్బు తరలించినట్లు అధికారులు గుర్తించారు.ఐదుగురు మహాదేవ్‌ కంపెనీ ప్రతినిధులను ఈడీ అరెస్ట్ చేసింది. మహదేవ్‌ యాప్‌ నిర్వాహకులు చంద్రభూషణ్‌, సతీష్‌చంద్రకర్‌, అనిల్‌దామని, సునీల్‌దామని, రవిఉప్పలను అరెస్ట్‌ చేశారు. విశాఖలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా మహదేవ్‌ యాప్‌తో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్నట్లు గుర్తించారు. పోకర్‌, కార్డ్‌గేమ్స్‌, బెట్టింగ్స్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 18 ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లతో మహదేవ్‌ సంస్థ మోసాలు చేసినట్లు సమాచారం.దేశవ్యాప్తంగా ఏజెంట్లతో మహదేవ్‌ సంస్థ మోసాలకు పాల్పడుతోన్నట్లు అధికారులు తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-24T13:18:19+05:30 IST

News Hub